మంత్రిమండలి

సైబర్ సెక్యూరిటీ రంగం లో సహకారం అంశం పై భారతదేశానికి, మొరాకో కు మధ్య ఎంఒయు ను గురించి మంత్రివర్గం దృష్టి కి తీసుకురావడమైంది

प्रविष्टि तिथि: 02 JAN 2019 6:03PM by PIB Hyderabad

సైబర్ సెక్యూరిటీ రంగం లో సహకారం అంశం పై భారతదేశానికి, మొరాకో కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది.  ఈ ఎంఒయు పై 2018వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు సంతకాలయ్యాయి.

భారతదేశానికి, మొరాకో కు మధ్య భద్రతపరమైన ఘటనల గురించి ఆరా తీయడంలోను, వాటిని పరిష్కరించడంలోను మరియు వాటిని నివారించడంలోను సంబంధించిన జ్ఞానాన్ని, అనుభవాలను ఒక పక్షం మరొక పక్షానికి అందజేసుకోవడానికిగాను సన్నిహితం గా సహకరించుకోవడాన్ని ప్రోత్సహించాలన్నది  ఈ ఎంఒయు ఉద్దేశం గా ఉంది.  మొరాకో తో కలసి సంస్థాగతమైనటువంటి మరియు సామర్ధ్య నిర్మాణ పరమైనటువంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ ఎంఒయు ను అమలులోకి తీసుకువస్తే సైబర్ సెక్యూరిటీ రంగం లో  గణనీయ స్థాయి ప్రయోజనాలు అందగలవు.


**


(रिलीज़ आईडी: 1558289) आगंतुक पटल : 458
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada