57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫీ 2026 ‘ధురంధర్’ విలేకరుల సమావేశంలో పాత్ర చిత్రణ కళను విశదీకరించిన ప్రముఖ నటుడు రాకేష్ బేడీ

రంగస్థల నేపథ్యం, లోతైన పాత్ర అధ్యయనమే ధురంధర్‌లో జమీల్ జమాలీ పాత్రకు రూపకల్పన చేశాయని 57వ ఇఫీ వేదికపై వెల్లడించిన రాకేష్ బేడీ

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 9:29PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340186Views: 6

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని (ఇఫీ) ఇండియన్ పనోరమా విభాగంలో ప్రధాన స్రవంతి సినిమా ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రారంభించిన ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన హిందీ ఫీచర్ ఫిల్మ్ ధురంధర్.. చలనచిత్రోత్సవం రెండో రోజున గోవాలోని పనాజీలో గల ఫెస్టివల్ మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ చర్చా సమావేశంలో సీనియర్ నటుడు రాకేష్ బేడీ, ప్రఖ్యాత ప్రొడక్షన్ డిజైనర్ సైని ఎస్ జోహ్రే పాల్గొని చిత్రానికి ఉన్న సృజనాత్మక ప్రయాణం, సూక్ష్మమైన పాత్ర చిత్రణ, దృశ్య ప్రపంచ నిర్మాణం గురించిన వివరాలను పంచుకున్నారు. సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ మహేష్ కుమార్ ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

జమీల్ జమాలీ పాత్ర పోషణ గురించి మాట్లాడుతూ సమకాలీన సినిమాలో బహుళ కోణాలు కలిగిన పాత్ర రచనకు ఉన్న ప్రాముఖ్యతను రాకేష్ బేడీ ప్రముఖంగా ప్రస్తావించారు. తన నటనా నైపుణ్యానికి శాశ్వత పునాదిగా అభివర్ణించిన తన సుదీర్ఘ రంగస్థల అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఈ పాత్రను తీర్చిదిద్దడంలో చేసిన నిశితమైన పరిశోధన గురించి బేడీ వివరించారు. ఒక పాత్ర చేష్టలు సన్నివేశానికి ఉన్న అవసరాలకు అనుగుణంగా ఉండాలని తద్వారా ఆ నటన కేవలం అనుకరణగా కాకుండా ఒక సంపూర్ణ పాత్ర చిత్రణగా నిలుస్తుందని ఆయన ప్రధానంగా చెప్పారు.

విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్రలతో కూడిన తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సినిమా పరిధి, ఆదరణలో వచ్చిన మార్పుల గురించి బేడీ మాట్లాడారు. ‘ఏక్ దూజే కే లియే’, ‘తిరంగా’, ‘చష్మే బద్దూర్’ వంటి మునుపటి చిత్రాలకు లభించిన అపారమైన ప్రజాదరణను గుర్తుచేసుకుంటూ  ఆ కాలంలోనూ సినిమాకు విపరీతమైన ప్రజాకర్షణ ఉన్నప్పటికీ డిజిటల్ అనుసంధానం లేకపోవడం వల్ల దాని పరిధి పరిమితంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.

అందుకు భిన్నంగా నేడు సామాజిక మాధ్యమాలు నటనను ప్రేక్షకులు ఆదరించే, దానితో మమేకమయ్యే తీరును పూర్తిగా మార్చివేశాయి. ఒకే ఒక్క క్లిక్‌తో నటుడి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యేలా ఇవి దోహదపడుతున్నాయి.

తన హాస్య, నాటకీయ సమయస్ఫూర్తి గురించి ఒక సినీ అభిమాని అడిగిన ప్రశ్నకు బేడీ బదులిస్తూ.. అలాంటి సూక్ష్మమైన హావభావాలు ఎప్పుడూ యాదృచ్ఛికంగా రావని వివరించారు. పాత్ర చిత్రణకు సహజత్వాన్ని తీసుకురావడానికి ఒక ఉద్దేశపూర్వక వ్యక్తీకరణ సాధనంగా స్క్రిప్ట్.. పాత్ర పరిణామ క్రమంలో భాగంగా ప్రతి కదలిక, హావభావం ఎంతో జాగ్రత్తగా ప్రణాళిక అవుతాయని ఆయన పేర్కొన్నారు.

భావోద్వేగాల మధ్య అంత సునాయాసంగా ఎలా మారగలరని, అద్దం ముందు సాధన చేస్తారా అని అడిగిన ప్రశ్నకు బేడీ తన నటనా విధానానికి సంబంధించిన కీలక అంశాలను వివరించారు. అద్దం ముందు సాధన చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. నటిస్తున్నప్పుడే మనల్ని మనం చూసుకోవడం వల్ల నటుడి ఎదుగుదల కుంటుపడుతుందని ఎందుకంటే ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే దానిని నిష్పక్షపాతంగా అంచనా వేయడం కష్టమని ఆయన వివరించారు. అందుకు బదులుగా ఒక పాత్రను లోతుగా అర్థం చేసుకొని ఆకళింపు చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన ప్రముఖంగా చెప్పారు. ఒకసారి నటుడు పోషిస్తున్న పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే సంభాషణలు, ప్రతిస్పందనలు, భావోద్వేగ మార్పులు సహజంగానే ప్రవహిస్తాయని ఆయన తెలిపారు.

చిత్ర నిర్మాణ వాస్తవికత, ప్రొడక్షన్ గురించి వివరించిన డిజైనర్ సైని ఎస్ జోహ్రే .. చిత్ర బృందం 40కి పైగా ప్రాక్టికల్ సెట్లను నిర్మించిందని వెల్లడించారు. పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాలకు నేరుగా వెళేలే అవకాంశం లేకపోవడంతో చిత్రం ఆయా పరిస్థితులను మొదటి నుంచి అత్యంత వాస్తవికంగా పునర్నిర్మించడానికి వార్తా ఆర్కైవ్‌లు, స్థానిక గ్యాంగ్ ఘర్షణల నివేదికలు, పట్టణ పరిస్థితులు, గూగుల్ మ్యాప్స్ వంటి వాటిని అధ్యయనం చేస్తూ జోహ్రే విస్తృతమైన పరిశోధనపై ఆధారపడ్డారు.

చలనచిత్ర నిర్మాణం వెనుక ఉన్న సృజనాత్మక ప్రక్రియలను అన్వేషించడానికి చిత్రనిర్మాతలు, కళాకారులు ప్రేక్షకులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ సినిమాపై అర్థవంతమైన చర్చలకు 57వ ఇఫీ ఒక చైతన్యవంతమైన వేదికగా నిలుస్తున్న పాత్రను ఈ విలేకరుల సమావేశం తెలియజేసింది.

ఇలాంటి ముఖాముఖి కార్యక్రమాల ద్వారా ఈ చలనచిత్రోత్సవం కేవలం తెరపై ఆకట్టుకునే కథలను మాత్రమే కాకుండా వాటికి జీవం పోసే నైపుణ్యం, పరిశోధన, సమష్టి కృషిని కూడా వేడుకగా జరుపుకుంటుంది. తద్వారా చలనచిత్ర వ్యక్తీకరణలోని విభిన్న కోణాల పట్ల మరింత లోతైన అవగాహన, ప్రశంసలను పెంపొందిస్తోంది.

ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340186
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026