వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐసీఏఆర్-సీఐఎఫ్ఏ ఆధ్వర్యంలో 14వ ఇండియన్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఫోరమ్

మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, సుస్థిర మార్గాల అన్వేషణకు భారత్ తో పాటు ఆరు దేశాల నుంచి పాల్గొన్న 1,000 మందికిపైగా ప్రతినిధులు

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 1:47PM by PIB Hyderabad

ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉన్న ఐసీఏఆర్-సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (ఐసీఏఆర్-సీఐఎఫ్ఏ) వద్ద మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో ప్రధాన అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సు అయిన 14వ భారత మత్స్య, ఆక్వాకల్చర్ ఫోరమ్ (14 ఐఎఫ్ఏఎఫ్) ఇవాళ ప్రారంభమైంది. 2026 నవంబర్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఆసియన్ ఫిషరీస్ సొసైటీ - ఇండియన్ బ్రాంచ్ (ఏఎఫ్ఎస్ఐబీ), ఐసీఏఆర్-సీఐఎఫ్ఏ (ఐసీఏఆర్-సీఐఎఫ్ఏ) కేంద్ర మత్స్య శాఖ నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ), ఒడిశా ప్రభుత్వ మత్స్య, పశు వనరుల అభివృద్ధి (ఎఫ్ఏఆర్‌డీ) శాఖ, ఆక్వాకల్చరిస్టుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

"ట్రాన్‌ఫార్మింగ్ ఆక్వాకల్చర్ అండ్ ఫిషరీస్: బ్రిడ్జింగ్ సైన్స్ అండ్ సొసైటీ" ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లటం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించటం, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల భాగస్వాములు, మత్స్య రైతుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయటంపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది.

బ్యాంకాక్‌లోని నెట్‌వర్క్ ఆఫ్ ఆక్వాకల్చర్ సెంటర్స్ ఇన్ ఆసియా- పసిఫిక్ (ఎన్ఏసీఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎడ్వర్డో లియానో ఈ సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ... ఆక్వాకల్చర్ రంగాన్ని మార్చేందుకు ఆవిష్కరణలు, నూతన సాంకేతికతల వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2338610) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Nepali , Marathi , Assamese , Odia , Kannada