హోం మంత్రిత్వ శాఖ
ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధాని శ్రీ మోదీ ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానానికి అనుగుణంగా చట్టవిరుద్ధ సంస్థగా ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై యూఏపీఏ కింద నిషేధాన్ని పొడిగించిన కేంద్ర హోంశాఖ
పరారీలో ఉన్న ఉగ్రవాద ప్రచారకుడు డాక్టర్ జాకీర్ నాయక్ నేతృత్వంలో కార్యకలాపాలు
మత విద్వేషాలను రెచ్చగొట్టడం, సామాజిక విభేదాలను పెంపొందించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు
ఉగ్రవాదం, వేర్పాటువాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న సంస్థ
హింసాత్మక అశాంతిని ప్రేరేపించడం, పరారీలో ఉన్న ఉగ్రవాదుల పునరేకీకరణకు ప్రోత్సాహం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు వెల్లడి
నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 1:41PM by PIB Hyderabad
ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదనే (జీరో టాలరెన్స్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)పై విధించిన నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ పొడిగించింది.
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘‘ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలపై ఎలాంటి సహనం చూపకూడదన్న ప్రధాని శ్రీ మోదీ దార్శనికతకు అనుగుణంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై విధించిన నిషేధాన్ని కేంద్ర హోంశాఖ పొడిగించింది. పరారీలో ఉన్న ఉగ్రవాద ప్రచారకుడు డాక్టర్ జాకీర్ నాయక్ నేతృత్వంలోని ఈ సంస్థ.. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, శత్రుత్వాన్ని పెంపొందించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం సహా భారత్‌కు వ్యతిరేకంగా పలు కుట్రపూరిత కార్యకలాపాలకు పాల్పడింది. ఉగ్రవాదం, వేర్పాటువాద భావజాలాన్ని విషపూరితంగా ప్రచారం చేయడం, హింసాత్మక అశాంతిని ప్రేరేపించడం, పరారీలో ఉన్న ఉగ్రవాదులు తిరిగి సంఘటితమయ్యేలా ప్రోత్సహించడం, మత సామరస్యాన్ని దెబ్బతీయడం వంటి చర్యలకు ఈ సంస్థ పాల్పడుతున్నట్లు గుర్తించారు” అని హోం మంత్రిత్వశాఖ కార్యాలయం పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2336393)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam