కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కార్మిక చట్టాల ప్రకారం అసంఘటిత రంగంలోని కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫాం కార్మికుల కోసం సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 10:29AM by PIB Hyderabad

భారతదేశంలో భారీ సంఖ్యలో ఉన్న అసంఘటిత కార్మిక వర్గానికి సమగ్ర సామాజిక భద్రతను కల్పించే దిశగా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ముఖ్యమైన చర్య చేపట్టింది. అసంఘటిత కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును అధికారికంగా ఏర్పాటు చేసింది. సామాజిక భద్రతా నియమావళిలోని చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ఏర్పాటైన ఈ బోర్డులు డిజిటల్ గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులను భారతదేశ అధికారిక సంక్షేమ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చి చరిత్రాత్మక మార్పునకు నాంది పలికాయి.

ఈ బోర్డులకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖ అగ్రిగేటర్ కంపెనీలు, యజమానులు, పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారు. సంప్రదాయ అసంఘటిత కార్మికులతో పాటు లక్షలాది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రతా అంతరాన్ని పూడ్చేలా లక్షిత సంక్షేమ పథకాలను రూపొందించడం, పర్యవేక్షించడం, సిఫార్సు చేయడమే ఈ బోర్డుల విధి.

జాతీయ సామాజిక భద్రతా బోర్డులు సంవత్సరానికి కనీసం మూడుసార్లు సమావేశమవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం ఈ సమావేశాల నిర్వహణ ప్రక్రియలు ఉండాలి.

దిగువ పేర్కొన్న విధులను జాతీయ సామాజిక భద్రతా బోర్డులు నిర్వర్తిస్తాయి:

(a) అసంఘటిత కార్మికులు, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ కార్మికుల్లోని వివిధ వర్గాల కోసం తగిన పథకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం.

(b) ఈ కోడ్ అమలుకు సంబంధించి ఎదురయ్యే సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి సూచనలివ్వడం. 

(c) అసంఘటిత కార్మికులు, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలను పర్యవేక్షించడం.

(d) రాష్ట్రస్థాయిలో నిర్వహించే రికార్డులను సమీక్షించడం.

(e) నిధులు, ఖాతాల నుంచి చేసే ఖర్చులను సమీక్షించడం.

(f) సమయానుగుణంగా కేంద్ర ప్రభుత్వం అప్పగించే ఇతర కార్యక్రమాలను చేపట్టడం.

***


(రిలీజ్ ఐడి: 2330434) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Malayalam