హోం మంత్రిత్వ శాఖ
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
విపత్తు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ఆయా రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర హోంమంత్రి హామీ
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
జరిగిన నష్టం, తదుపరి సహాయంపై సమీక్షించేందుకు ప్రభావిత ప్రాంతాలకు ఐఎంసీటీ బృందాలు
ప్రజలకు అండగా నిలిచేందుకు నిబద్ధతతో ఉన్న కేంద్ర ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2026 11:36AM by PIB Hyderabad
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పోస్టు పెట్టారు. “అర్నబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడాను. విపత్తు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, అవసరమైన సహాయాన్ని అందించేందుకు త్వరలోనే ఐఎంసీటీ బృందాలను పంపుతాం. ప్రజలకు అండగా నిలవటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉంది” అని తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2329961)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam