నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 6:40PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల హైజంప్ టీ64 విభాగంలో రజత పతకం గెలుచుకున్న బంటీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
అతని ప్రతిభ, పట్టుదల కొనియాడదగినవని పేర్కొంటూ, మరింత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్ విజయాలకు ఈ పతకం అతని ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేయగలదని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల హైజంప్ టీ64 విభాగంలో బంటీ రజత పతకం సాధించడం నాకంతో ఆనందాన్నిచ్చింది. అతని ప్రతిభ, పట్టుదల ప్రశంసనీయం. మరింత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్ విజయాలు సాధించే దశగా ఈ గెలుపు మరింత ఆత్మవిశ్వాసం ఇవ్వగలదని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
***