నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 7:26PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో మహిళల సింగిల్స్ క్లాస్-6 విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న ప్రాచీ పాండేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆసియా పారా క్రీడల్లో అరంగేట్రంలోనే ప్రాచీ పాండే కాంస్య పతకం సాధించడం భారత పారా టేబుల్ టెన్నిస్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషమని ప్రధాని పేర్కొన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
‘‘భారత పారా టేబుల్ టెన్నిస్ చరిత్రలో ఇదొక గొప్ప ఘట్టం..
ఆసియా పారా క్రీడల్లో మహిళల సింగిల్స్ క్లాస్-6 విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా ప్రాచీ పాండే ప్రత్యేక ఘనత సాధించారు. ఆమె అరంగేట్రంలోనే కాంస్య పతకం గెలుచుకోవడం కీలక విజయం
ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు’’ అని ప్రధాని పేర్కొన్నారు.