ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బేబీ సహనా రవికి ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 7:44PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడల్లో మహిళల సింగిల్స్‌ క్లాస్‌ - 9 విభాగంలో కాంస్య పతకం సాధించిన బేబీ సహనా రవికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

తొలిసారిగా ఆసియా పారా క్రీడల్లో పాల్గొన్న ఆమె, స్టాండింగ్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించారని ప్రధాని పేర్కొన్నారు. ఈ అపూర్వ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

“ఆసియా పారా క్రీడల్లో స్టాండింగ్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని సాధించి బేబీ సహనా రవి చరిత్ర సృష్టించారు! మహిళల సింగిల్స్‌ క్లాస్‌ - 9 విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించడం విశేషం. తొలిసారిగా ఈ క్రీడల్లో పాల్గొని ఈ ఘనత సాధించడం మరింత ప్రత్యేకం. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. యువ క్రీడాకారులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగేందుకు ఈ విజయం తప్పకుండా స్ఫూర్తినిస్తుంది. సహనాకు అభినందనలు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని అని ప్రధానమంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 


(రిలీజ్ ఐడి: 2325802) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam