నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 7:20PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల జావెలిన్ త్రో ఎఫ్53/54 విభాగంలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకం గెలుచుకున్న ఆయుష్ వర్మకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
ఆ క్రీడాకారుడికి ఇది చిరస్మరణీయ అరంగేట్రం కావడం విశేషమని పేర్కొంటూ, భవిష్యత్ ప్రస్థానాన్ని ఆయుష్ మరింత మెరుగ్గా కొనసాగించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ఆ మేరకు క్రీడా రంగంలో తనదైన ముద్ర వేస్తూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆయుష్ వర్మకు ఇది చిరస్మరణీయ అరంగేట్రం! పురుషుల జావెలిన్ త్రో ఎఫ్53/54 ఈవెంట్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకం సాధించడంపై అతనికి నా అభినందనలు. ఈ విజయాన్ని మరింత మెరుగుపరచుకుంటూ భవిష్యత్తులో తనదైన ముద్ర వేస్తూనే ఉండాలని ఆశిస్తూ నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.