ప్రధాన మంత్రి కార్యాలయం
స్వర్ణం గెలిచి, ఆసియా పారా క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పిన మోనా అగర్వాల్‌కు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 1:14PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడలు–2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో బంగారు పతకం సాధించిన మోనా అగర్వాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
మోనా అగర్వాల్ సాధించిన అద్భుతమైన స్కోరుతో ఆసియా పారా క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీంతో పోటీల్లో భారత్‌కు తొలి రోజు మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపారు. ఆమె కచ్చితత్వం, దృఢ సంకల్పం, సంయమనాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. రానున్న పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ఆసియా పారా క్రీడలు–2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో బంగారు పతకం సాధించిన మోనా అగర్వాల్‌కు అభినందనలు. ఆమె అద్భుతమైన స్కోరు కారణంగా ఆసియా పారా క్రీడల్లో కొత్త రికార్డును కూడా నెలకొల్పారు. పోటీల తొలి రోజును భారత్‌కు మరింత ప్రత్యేకంగా మార్చిన అద్భుతమైన ఘనత. ఆమె కచ్చితత్వం, పట్టుదల, సంయమనం నిజంగా ప్రశంసనీయం. రానున్న పోటీల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
(రిలీజ్ ఐడి: 2325250)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam