ప్రధాన మంత్రి కార్యాలయం
కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ఆత్మీయంగా, ప్రయోజనకరమైన చర్చలు జరిపిన ప్రధానమంత్రి… వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై దృష్టి
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 10:10PM by PIB Hyderabad
కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయంగా, ప్రయోజనకరమైన చర్చలు జరిపారు.
వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా వ్యూహాత్మక భాగస్వామ్యంలోని కీలక రంగాల్లో స్పష్టమైన ఫలితాల సాధనకు కృషి చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. భారత్-కెనడా మధ్య నెలకొన్న సానుకూల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
స్థిరమైన, సుసంపన్న ప్రపంచం కోసం భారత్, కెనడా పాటుపడుతున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
"ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ఆత్మీయ, ఫలప్రదమైన చర్చలు జరిగాయి.
భారత్-కెనడా మధ్య నెలకొన్న సానుకూల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేం నిర్ణయించాం.వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా వ్యూహాత్మక భాగస్వామ్యంలోని కీలక రంగాల్లో స్పష్టమైన ఫలితాల సాధనకు కృషి చేయాలని అంగీకరించాం.
స్థిరమైన, సుసంపన్న ప్రపంచం కోసం భారత్, కెనడా పాటుపడుతున్నాయి.
@MarkJCarney”
(రిలీజ్ ఐడి: 2323111)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7