హోం మంత్రిత్వ శాఖ
బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశానికి న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వడం దేశానికి గౌరవం: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాలతో పెరిగే తీవ్రవాదం, అక్రమ రవాణా, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో మన ఉమ్మడి సంకల్పాన్ని స్పష్టం చేస్తున్న ఈ చరిత్రాత్మక సమావేశం
నిర్ణయాత్మక సమన్వయం ద్వారా మరింత సురక్షితమైన, బలమైన, భద్రమైన బిమ్స్టెక్ ప్రాంత నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య
సభ్య దేశాల హోంమంత్రులకు, ప్రతినిధి బృందాలకు సాదర స్వాగతం పలికిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 6:29PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో రేపు జరగనున్న తొలి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశానికి ఆతిథ్యమివ్వడం దేశానికి దక్కిన గౌరవమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు.
‘ఎక్స్’ వేదికగా ఈ రోజు చేసిన ఒక పోస్టులో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు... “13 అక్టోబర్ 2026న జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశానికి న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వడం దేశానికి దక్కిన గౌరవం. గౌరవ హోంమంత్రులకు, సభ్య దేశాల ప్రతినిధి బృందాలకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాలతో పెరిగే తీవ్రవాదం, అక్రమ రవాణా, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పును ఎదుర్కోవడంలో మన ఉమ్మడి సంకల్పాన్ని ఈ చరిత్రాత్మక సమావేశం స్పష్టం చేస్తుంది. నిర్ణయాత్మక సమన్వయం ద్వారా సురక్షితమైన, బలమైన, మరింత భద్రమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నాం.”
***
(రిలీజ్ ఐడి: 2322602)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam