ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా
తనకు శుభాకాంక్షలు తెలిపిన బోత్స్‌వానా అధ్యక్షులు డూమా బోకోకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 9:06PM by PIB Hyderabad
తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన బోత్స్‌వానా అధ్యక్షులు శ్రీ డూమా బోకోకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. బోత్స్‌వానాతో స్నేహానికి భారత్ ఎంతో విలువనిస్తుందని, మన సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
అధ్యక్షులు డూమా బోకో గారూ... మీ ఆత్మీయ శుభాకాంక్షలను నా హృదయపూర్వక అభినందనలు.
బోత్స్‌వానాతో స్నేహానికి భారత్ ఎంతో విలువనిస్తుంది. మన సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను.
(రిలీజ్ ఐడి: 2320457)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10