ప్రధాన మంత్రి కార్యాలయం
వికసిత్ భారత్ నిర్మాణానికి, గ్లోబల్ సౌత్‌కు స్ఫూర్తినిచ్చే, నాయకత్వం, సేవను తెలియజేసే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 12:23PM by PIB Hyderabad
జ్ఞానం, కరుణ, ధైర్యం, నిస్వార్థ సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం ప్రతిబింబిస్తుందని కొనియాడుతూ భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ తోబ్గే రాసిన కథనాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఈ విలువలకు స్పష్టమైన రూపం వికసిత్ భారత్ అని శ్రీ షెరింగ్ తోబ్గే అన్నారు. ఈ విలువలు భారతదేశానికి ఉమ్మడి దృక్పథాన్ని, వికసిత్ భారత్ నిర్మాణానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. శక్తిమంతమైన భారత్… పొరుగుదేశాలకు, గ్లోబల్ సౌత్ దేశాలకు మరిన్ని సేవలందించగలదని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
"జ్ఞానం, కరుణ, ధైర్యం, నిస్వార్థ సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం ప్రతిబింబిస్తుందని భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ తోబ్గే రాసిన కథనంలో పేర్కొన్నారు. ఈ విలువలకు స్పష్టమైన రూపం వికసిత్ భారత్ అని, ఇవి భారతదేశానికి ఉమ్మడి దృక్పథాన్ని, వికసిత్ భారత్ నిర్మాణానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
శక్తిమంతమైన భారత్… పొరుగుదేశాలకు, గ్లోబల్ సౌత్‌కు మరిన్ని సేవలందించగలదని ఈ కథనంలో తెలిపారు. నాయకత్వం, సేవలపై ఇదొక ఆలోచనాత్మక విశ్లేషణ"
***
(రిలీజ్ ఐడి: 2320077)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6