వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో రవాణా అంతరాయాల నేపథ్యంలో ఎగుమతిదారులకు రిలీఫ్ పథకం అమలు గడువును పొడిగించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 11:01AM by PIB Hyderabad
పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దానివల్ల గల్ఫ్ తో పాటు పరిసర ప్రాంతాల సముద్ర రవాణాపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ (ఈపీఎం) కింద తాత్కాలికంగా అమలు చేస్తున్న రెస్పాన్స్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ఫెసిలిటేషన్ (రిలీఫ్) పథకంలోని రెండవ విభాగానికి వర్తించే గడువును పొడిగిస్తూ సెప్టెంబర్ 30, 2026 తేదీన నోటిఫికేషన్ (నంబర్ 37/2026-27) ను విడుదల చేసింది.
రిలీఫ్' పథకంలోని కాంపోనెంట్-II ద్వారా పశ్చిమ ఆసియా ప్రాంతాలకు ఎగుమతులు చేసే వ్యాపారులు ఈసిజిసి (ఈసీజీసీ) ఇన్సూరెన్స్ కవరేజ్ పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీని కింద ఎగుమతిదారులకు 95 శాతానికి పైగా నష్టపరిహార రక్షణ లభిస్తుంది. మార్చి 16, 2026 లేదా ఆ తర్వాత తీసుకున్న 'స్టాండ్ అలోన్ పాలసీలు' లేదా 'హోల్ టర్నోవర్ పాలసీల'కు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇంధన రవాణాను మినహాయించి.. ఫుల్ కంటైనర్ లోడ్ (ఎఫ్సీఎల్), తక్కువ కంటైనర్ లోడ్ (ఎల్సీఎల్), శీతలీకృత (రీఫర్) కంటైనర్ల ద్వారా పంపే సరుకులకు ఈ బీమా రక్షణ అందుతుంది. అంతేకాకుండా, ఈ సంక్షోభ సమయానికి ముందు ఉన్న ప్రీమియం ధరలకంటే అదనంగా రూపాయి కూడా ఎగుమతిదారులపై భారం పడకుండా ప్రీమియం శాతాన్ని స్థిరంగా ఉంచుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
గల్ఫ్, పశ్చిమ ఆసియా సముద్ర మార్గాల్లో తలెత్తిన ఆటంకాల వల్ల పెరిగిన రవాణా ఛార్జీలు, విపరీతంగా పెరిగిన బీమా ప్రీమియంలు, యుద్ధ వాతావరణం కారణంగా ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాల నుంచి భారతీయ ఎగుమతిదారులకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 19, 2026న 'రిలీఫ్' పథకాన్ని ప్రత్యేకంగా ప్రారంభించింది.
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రవాణా రంగంలో నెలకొన్న అనిశ్చితుల వేళ దేశీయ ఎగుమతులను బలోపేతం చేయడంతో పాటు, విదేశీ వ్యాపారం ఆటంకం లేకుండా సాగేందుకు, భారతీయ ఎగుమతిదారులకు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ గడువు పొడిగింపే నిదర్శనం.
****
(రిలీజ్ ఐడి: 2318360)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10