హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎఫ్‌సీఆర్ఏ నమోదులో సాయం చేయడానికి లంచం అడిగిన ఇద్దరు అధికారుల అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 12:45PM by PIB Hyderabad

హోం వ్యవహారాల శాఖకు నిర్దిష్ట సమాచారం అందడంతో, ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం నిన్న న్యూఢిల్లీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసింది. దీనిలో కేంద్రీయ ఏజెన్సీలు కూడా సహకారాన్ని అందించాయి. అరెస్టు చేసిన ఇద్దరు అధికారుల్లో ఒకరు సీనియర్ అకౌంటెంట్‌, మరొకరు అకౌంటెంట్‌. వారు ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్టు (ఎఫ్‌సీఆర్ఏ) కింద ఒక సంఘాన్ని నమోదు చేసేందుకు లంచం అడిగారన్న ఆరోపణలు వచ్చాయి.
అధికారుల్లో ఒకరు ప్రస్తుతం హోం శాఖకు చెందిన విదేశీయుల విభాగంలో పనిచేస్తుండగా, మరొకరు పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. రెండో అధికారి ఇంతకు ముందు విదేశీయుల విభాగంలో పనిచేశారు. కొన్ని సంఘాలతో  వారు  పరిచయం ఏర్పరుచుకొని, నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి, నవీకరణకు సాయపడటానికి చట్టవిరుద్ధంగా చెల్లింపులను అందుకోదలచినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి అయింది. దీనిపై మరింత క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నారు.
హోం శాఖ  అవినీతికి ఆమడ దూరంలో ఉండే విధానాన్ని అవలంబిస్తోంది. ఈ వ్యవహారంలో తగిన చట్టపరమైన చర్యలకు తోడు, విభాగం పరంగా కూడా చర్యలను తీసుకొంటున్నారు. ఎఫ్‌సీఆర్ఏకు సంబంధించిన సేవలు అన్నిటినీ ఎఫ్‌సీఆర్ఏ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో అందజేస్తున్నారు. ఎఫ్‌సీఆర్ఏకు సంబంధించిన ఏ విధమైన సేవలను సమకూర్చడంలోనైనా మధ్యవర్తులకు, ఏజెంట్లకు, లేదా వ్యక్తులకు ఎలాంటి అధికారాలనూ ఇవ్వలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2316522) సందర్శకుల సూచీ సంఖ్య : : 4