ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల హై జంప్ పోటీలో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించిన సర్వేశ్ కుశారే... అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 9:19PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల హై జంప్ పోటీలో రజత పతకాన్ని సర్వేశ్ కుశారే గెలుచుకొని, చరిత్రను సృష్టించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
ఈ పోటీలో పతకం కోసం భారత్ అయిదు దశాబ్దాలుగా ఎదురుచూసిందని, ఆయన అద్భుత ప్రదర్శనతో ఈ నిరీక్షణకు స్వస్తి పలికారని ప్రధానమంత్రి అన్నారు. ఇది నిజానికి పట్టుదలతో, దృఢసంకల్పంతో చేజిక్కించుకున్న స్మరణీయ విజయమని శ్రీ మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ఆసియా క్రీడల్లో పురుషుల హై జంప్ ఈవెంట్‌లో సర్వేశ్ కుశారే చరిత్రాత్మక రజతాన్ని సాధించారు. ఈ పోటీలో పతకం కోసం అయిదు దశాబ్దాలుగా భారత్ నిరీక్షించింది.. ఆయన ఒక అద్భుత ప్రదర్శనతో ఈ ఎదురుచూపులకు స్వస్తి పలికారు. ఇది నిజానికి పట్టుదల, దృఢసంకల్పం నుంచి స్ఫూర్తిని పొంది చేజిక్కించుకున్న స్మరణీయ విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు’’ అని తెలిపింది.
(రిలీజ్ ఐడి: 2315980)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam