వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తప్పుదోవ పట్టించే 'టిప్పింగ్' సూచనలు, 'డార్క్ ప్యాటర్న్స్' కారణంగా రాపిడోకు రూ.10 లక్షల జరిమానా విధించిన సీసీపీఏ

రాపిడో రైడ్-బుకింగ్ ఇంటర్‌ఫేస్‌లో 'కన్‌ఫర్మ్ షేమింగ్', 'ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్' ఉన్నట్లు గుర్తింపు

వినియోగదారులను ఎక్కువ మొత్తం చెల్లించేలా ప్రేరేపిస్తూ తప్పుదోవ పట్టించే సూచనలు, పద్ధతులను నిలిపివేయాలని ఆదేశం

రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తు టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ పద్ధతులపై పరిశీలన తర్వాత చర్యలు చేపట్టిన సీసీపీఏ

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2026 5:24PM by PIB Hyderabad

ప్రధాన కమిషనర్ శ్రీమతి నిధి ఖరేకమిషనర్ శ్రీ అనుపమ్ మిశ్రాల నేతృత్వంలోని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ)... రాపిడో రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.10 లక్షల జరిమానా విధించిందిరైడ్‌లు ఖరారు కాకముందే ప్రయాణికులను ఎక్కువ మొత్తం చెల్లించేలా ప్రేరేపించే విధానంతో తప్పుదోవ పట్టించే ప్రకటనలుఅన్యాయమైన వాణిజ్య పద్ధతులుఅన్యాయమైన ఒప్పందండార్క్ ప్యాటర్న్‌లను అనుసరించినందుకు ఈ జరిమానా విధించారు.

ప్రయాణానికి ముందు టిప్పింగ్డైనమిక్ ప్రైసింగ్‌కు సంబంధించిన పద్ధతులను పరిశీలించడం కోసం దేశంలో పనిచేస్తున్న క్యాబ్బైక్-టాక్సీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లపై సీసీపీఏ నిర్వహించిన విస్తృత తనిఖీల తర్వాత ఈ చర్య తీసుకున్నారువివిధ ప్లాట్‌ఫారమ్‌లను తనిఖీ చేసే సమయంలోఒక రైడర్ కోసం బుకింగ్ ప్రాసెస్ అవుతున్న సమయంలోనే రాపిడో యాప్ "ధర ఎంత ఎక్కువగా ఉంటేరైడ్ దొరికే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది"... "కెప్టెన్లు రూ.60కి అంగీకరించడం లేదు. +10, +20, +30 జోడించి ప్రయత్నించండి" వంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా సీసీపీఏ గుర్తించింది.

ప్రాంప్ట్‌లు “కన్‌ఫర్మ్ షేమింగ్” కిందకు వస్తాయని గుర్తించిన సీసీపీఏ

రాపిడో అల్గారిథం మొదట ప్రయాణికులకు ఒక ఛార్జీని చెప్పిఆ చార్జీకి ప్రయాణికులు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత... కెప్టెన్లు అసలు ధరను అంగీకరించడం లేదనే కారణంతో ఎక్కువ చెల్లించేలా ప్రయాణికులను ప్రేరేపిస్తున్నట్లు సీసీపీఏ కనుగొందిప్రయాణికులు ఇప్పటికే చేసిన బుకింగ్‌కు కట్టుబడిబేరసారాలకు పరిమిత అవకాశం ఉన్న దశలో అదనపు మొత్తం చెల్లిస్తేనే త్వరగా రైడ్ దొరుకుతుందనే తప్పుడు అభిప్రాయాన్ని ఈ పద్ధతి వారికి కలిగిస్తుందని సీసీపీఏ పేర్కొందివినియోగదారులు ఎక్కువ చెల్లించడానికి అంగీకరించకపోతే రైడ్ కోల్పోతామనే భావననూభయాన్నీ ఇది సృష్టిస్తోందిఈ పద్ధతిని "కన్‌ఫర్మ్ షేమింగ్అనే డార్క్ ప్యాటర్న్‌గానే పరిగణిస్తారని తీర్పునిచ్చిందిఇది "డార్క్ ప్యాటర్న్‌ల నివారణనియంత్రణ మార్గదర్శకాలు-2023" కింద గుర్తించిన ఒక డార్క్ ప్యాటర్న్.

రంగుల ఆధారిత ధరల స్లైడర్ రెండో 'డార్క్ ప్యాటర్న్'గా గుర్తింపు

రాపిడో అనుసరిస్తున్న “మీ ధరను నిర్ణయించుకోండి” స్లైడర్‌నూ సీసీపీఏ పరిశీలించిరైడర్ ధర నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కోసం దానిని రంగులతో కోడ్ చేసినట్లు కనుగొంది.

ధరను పెంచినప్పుడు"రైడ్ దొరికే అవకాశం ఎక్కువ" అనే ఎంపిక ఆకుపచ్చ రంగులో కనిపించింది.

ధరను తగ్గించడం వల్ల ఎరుపు లేదా నారింజ రంగు హెచ్చరిక కనిపించింది.

ధరను తగ్గించడం కంటే పెంచడానికి స్లైడర్ ఎక్కువ వెసులుబాటును కల్పించింది.

దాంతో పాటు ఉన్న టెక్స్ట్‌తో సంబంధం లేకుండాఇంటర్‌ఫేస్ నమూనా దృశ్యపరంగా వినియోగదారులను అధిక మొత్తం చెల్లించేలా ప్రోత్సహిస్తున్నందునఇది రెండో డార్క్ ప్యాటర్న్ అయిన “ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్” కిందకు వస్తుందని సీసీపీఏ నిర్ధారించింది.

ముందస్తు చెల్లింపును వాస్తవిక "టిప్"గా పరిగణించలేం

బుకింగ్ సమయంలో ప్రయాణికులకు చూపించే చార్జీలోనే దూరంసమయంట్రాఫిక్టోల్ రుసుములుడ్రైవర్‌కు చెల్లించాల్సిన మొత్తం వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారని సీసీపీఏ గుర్తించిందిఈ నేపథ్యంలోప్రయాణం ప్రారంభం కాకముందే అదే ప్రయాణానికి అదనపు మొత్తం చెల్లించాలని సూచించడంలో ఎటువంటి సమంజసత లేదని సీసీపీఏ అభిప్రాయపడిందిసాధారణంగా 'టిప్'... సేవ పొందిన తర్వాత స్వచ్ఛందంగా ఇచ్చే చెల్లింపు మాత్రమేసేవను అందించడానికి దానిని ఒక షరతుగా చూపకూడదని సీసీపీఏ స్పష్టం చేసింది.

మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025నూ సీసీపీఏ ప్రస్తావించిందిఈ మార్గదర్శకాల ప్రకారంటిప్పింగ్ ఫీచర్‌ను రైడ్ పూర్తయిన తర్వాత మాత్రమే అందుబాటులో ఉంచాలి... బుకింగ్ సమయంలో గానీ లేదా రైడ్ మధ్యలో గానీ కాదుటిప్పింగ్ స్వచ్ఛందమైనదిరైడర్ అదనపు మొత్తం చెల్లించినాచెల్లించకపోయినా తమ మ్యాచింగ్ అల్గారిథం పనిచేస్తూనే ఉంటుందనీ... ఆ ప్రాంప్ట్‌లు కేవలం రైడర్డ్రైవర్ మధ్య జరిగే ఆఫ్‌లైన్ సంభాషణ లాంటి రియల్-టైమ్ సంప్రదింపులను మాత్రమే ప్రతిబింబిస్తాయని రాపిడో వాదించింది.

రైడర్‌లు ప్లాట్‌ఫారమ్‌పై అత్యంత ఎక్కువగా ఆధారపడి ఉన్న కీలక సమయంలోనే ఈ 'ప్రాంప్ట్‌ల' (ప్రోత్సాహక సూచనలసమయంరూపకల్పన వారిపై ఒత్తిడిని కలిగిస్తాయని పేర్కొంటూ సీసీపీఏ ఈ వాదనలను తిరస్కరించిందిఅదనపు మొత్తం చెల్లించడం వల్ల రైడర్‌కు రైడ్ లభించే అవకాశం నిజంగా పెరుగుతుందనేందుకు ఎటువంటి ఆధారాలనూ రాపిడో సమర్పించలేదని అది మరింతగా స్పష్టం చేసిందిఅందువల్లఆ వాదన నిరాధారమైనదనీతప్పుదోవ పట్టించేదిగా ఉందని నిర్ధారణ అయింది.

రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై సమగ్ర పరిశీలన

రైడ్-హెయిలింగ్బైక్-టాక్సీ వేదికల్లో అడ్వాన్స్-టిప్డార్క్-ప్యాటర్న్ పద్ధతులపై సీసీపీఏ జరుపుతున్న విస్తృత పరిశీలనలో భాగంగానే రాపిడోపై ఈ చర్య తీసుకున్నారుడార్క్ ప్యాటర్న్‌ల నివారణనియంత్రణ మార్గదర్శకాలు-2023కు కట్టుబడి ఉండాలనీవాటికి అనుగుణంగా పనిచేయుటకు సంబంధించి స్వీయ-ప్రకటనలను సమర్పించాలని ఉబెర్ఓలారాపిడోనమ్మ యాత్రి వంటి ప్లాట్‌ఫారమ్‌లకు గతంలోనే సీసీపీఏ నోటీసులు జారీ చేసిందిఈ విషయంగా ఉబెర్ఓలాపై సీసీపీఏ జరుపుతున్న పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోంది.

వినియోగదారుల భద్రత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన సీసీపీఏ

వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం తన చట్టబద్ధమైన విధిని నిర్వర్తిస్తూ... ఒక వర్గంగా వినియోగదారులను రక్షించడానికిఅన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికివస్తువులు లేదా సేవలకు సంబంధించి ఎలాంటి తప్పు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయకుండా చూసేందుకు సీసీపీఏ చురుగ్గా చర్యలు కొనసాగిస్తోందితప్పుదారి పట్టించే ప్రకటనలుఅన్యాయమైన వాణిజ్య పద్ధతులు లేదా డార్క్ ప్యాటర్న్‌లకు సంబంధించిన ఫిర్యాదులు లేదా సమస్యలు ఉన్న వినియోగదారులు తమ సమస్యలను 1915 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయడం ద్వారా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ వద్ద నమోదు చేసుకోవచ్చు లేదా com-ccpa[at]gov[dot]in ద్వారా సీసీపీఏకు రాతపూర్వకంగా తెలియజేయవచ్చు.

తుది ఉత్తర్వులు సీసీపీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2310750) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Kannada