సహకార మంత్రిత్వ శాఖ
నిజమైన డిపాజిటర్ల క్లెయిములను వేగవంతం చేయడానికి సీఆర్‌సీఎస్–సహారా రిఫండ్ పోర్టల్‌ను పునరుద్ధరించిన సహకార మంత్రిత్వశాఖ
ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల ద్వారా 41.56 లక్షల డిపాజిటర్లకు రూ. 9,267 కోట్లు వాపసు
సురక్షితంగా, పారదర్శకంగా, డిజిటల్‌గా, కాగితరహితంగా, ధ్రువీకరణ ఆధారంగా కొనసాగుతున్న సహారా ఖాతాదారుల రిఫండ్ పక్రియ
సహారా డిపాజిటర్ల క్లెయిముల ప్రక్రియను పునఃప్రారంభించిన సహకార మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 8:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన ‘సహకార్ సే సమృద్ధి’ అందిస్తున్న మార్గదర్శకత్వంలో, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో... సహకార సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, సహకార రంగంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ సంస్థలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. దీనిలో భాగంగానే డబ్ల్యూపీ నెం 191/2022లో 2023, మార్చి 29 న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుకు అనుగుణంగా చట్టబద్దమైన డిపాజిటర్లకు, అర్హత కలిగిన, వాస్తవ బకాయిల చెల్లింపులను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్‌సీఎస్) సులభతరం చేస్తోంది.
ఇప్పటి వరకు, 41,56,711 మంది డిపాజిటర్లకు ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 9,267 కోట్ల రిఫండ్ చేశారు. సీఆర్‌సీఎస్-సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా సుమారు 20 లక్షల దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడు పోర్టల్‌ను పునరుద్ధరించడంతో పెండింగులో ఉన్న దరఖాస్తుల ధ్రువీకరణ, వాపసు ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది.
సహారా సొసైటీలకు సంబంధం లేని కొన్ని విషయాల కారణంగా నవంబర్ 2025లో వాటి ప్రాంగణాలను సీల్ చేయడంతో, సహారా సహకార సంఘాల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. హార్డ్‌వేర్, వార్షిక నిర్వహణ ఒప్పందాలకు (ఏఎంసీ) సంబంధించిన బకాయిలు, అవసరమైన ఐటీ మౌలిక సదుపాయాలనూ, లైసెన్సులనూ పునరుద్ధరించడం, మానవ వనరులు, ఇతర పరిపాలనా సమస్యలతో సహా ఈ సొసైటీలు కార్యాచరణపరమైన, పరిపాలనాపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాయి. వీటన్నింటి కారణంగా రిఫండ్ క్లెయిమ్‌లకు అవసరమైన ధృవీకరణ, ప్రాసెసింగ్ కార్యకలాపాలకు ఆటకం ఏర్పడింది.
రిఫండ్ ప్రక్రియను ప్రభావితం చేస్తున్న సహారా సొసైటీల పరిపాలన, ఆర్థిక, కార్యకలాపాలు, సాంకేతిక సంబంధిత అవరోధాలను పరిష్కరించడంలో సహకార మంత్రిత్వశాఖ కీలకపాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, అధికార యంత్రాంగంతో సహా సంబంధిత వర్గాలతో నిరంతర సంస్థాగత జోక్యం, సమన్వయం ద్వారా అవసరమైన వ్యవస్థలు, మౌలికవసతులు, పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలను సీఆర్‌సీఎస్ పరిష్కరించింది. అలాగే పోర్టల్, అనుబంధ ధ్రువీకరణ వ్యవస్థలను పునుద్ధరించడానికి వీలు కల్పించింది. ఫలితంగా సహారా గ్రూపు సహకార సంఘాలైన లక్నోలోని సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, భోపాల్‌లోని సహారయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతాలోని హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్‌లోని స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన అసలైన డిపాజిటర్లకు చట్టబద్దంగా రావాల్సిన బకాయిల చెల్లింపు ప్రక్రియను తిరిగి ప్రారంభించింది.
***
(రిలీజ్ ఐడి: 2308227)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2