అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

డాక్టర్‌ జితేంద్ర సింగ్, ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ వర్చువల్ సమావేశం

రానున్న ‘అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు’, ‘బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో’లో ఫ్రాన్స్ భాగస్వామ్యంపై చర్చ

మానవ సహిత అంతరిక్షయానం, అధునాతన సాంకేతికతలు, పారిశ్రామిక సహకారంతో భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం మరింత బలోపేతం

పారిస్ సదస్సులో లొ ఎర్త్ ఆర్బిట్‌కు భారత్ చేపట్టే భవిష్యత్తు మానవ సహిత అంతరిక్ష యాత్రలపై కీలకోపన్యాసం చేయడానికి ఇస్రో ఛైర్మన్‌కు ఆహ్వానం

ఈ నెల ఆఖరులో బెంగళూరులోని ఇస్రో కేంద్రాలను సందర్శించనున్న ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2026 4:33PM by PIB Hyderabad

ఫ్రాన్స్ ఉన్నత విద్యపరిశోధనఅంతరిక్షశాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్‌తో కేంద్ర శాస్త్రసాంకేతికభూ విజ్ఞాన శాస్త్రాలశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)ప్రధానమంత్రి కార్యాలయంసిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్లుఅణుశక్తిఅంతరిక్షశాఖల సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ వర్చువల్‌గా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారుమానవ సహిత అంతరిక్షయానంఅధునాతన అంతరిక్ష సాంకేతికతలుఇరు దేశాల అంతరిక్ష సంస్థలుపరిశ్రమల మధ్య మరింత విస్తృత భాగస్వామ్యంతో సహా అంతరిక్ష రంగంలో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

2026 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పారిస్‌లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు, 2026 సెప్టెంబర్ నుంచి వరకు జరగనున్న బెంగళూరు స్పేస్ ఎక్స్‌పోకు ముందు ఈ చర్చలు జరిగాయిపారిస్ సదస్సులో భారత్ పాల్గొనడంబెంగళూరు స్పేస్ ఎక్స్‌పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యంతోపాటు ఈ నెలాఖరులో ప్రొఫెసర్ బాప్టిస్ట్ భారత్‌లో చేపట్టనున్న పర్యటనపై ఇరుదేశాల నేతలు చర్చించారు.

అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనడానికి భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందనిఫ్రాన్స్‌తో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని డాక్టర్‌ జితేంద్ర సింగ్ తెలిపారుఅంతరిక్ష విజ్ఞానంసాంకేతికతఅనువర్తనాలుఅంతరిక్ష ఆర్థిక వ్యవస్థసురక్షిత అంతరిక్షం వంటి అంశాలపై సదస్సు దృష్టి సారించడం వల్ల అంతరిక్ష రంగ భవిష్యత్తుపై అంతర్జాతీయ చర్చలుసహకారానికి ఇదొక కీలక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

బాహ్య అంతరిక్షాన్ని సుస్థిరంగా వినియోగించడంఅంతరిక్ష ఆధారిత శాస్త్రీయ డేటా అందుబాటులో ఉండటంపారదర్శకతసమగ్రతఫ్రీక్వెన్సీ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూనియంత్రణ వ్యవస్థకు మద్దతు వంటి అంశాలపై సదస్సులో ప్రతిపాదించిన ఫలితాలను భారత్ స్వాగతించిందిఈ కార్యక్రమాల తుది రూపకల్పన సందర్భంగా ఫ్రాన్స్‌తో అభిప్రాయాలను పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని డాక్టర్‌ జితేంద్ర సింగ్ తెలిపారు.

పారిస్ సదస్సుకు భారత్‌ అందించనున్న సహకారం ఈ చర్చల్లో ప్రధాన అంశంగా నిలిచిందిఇస్రో చైర్మన్అంతరిక్ష శాఖ కార్యదర్శి లో ఎర్త్ ఆర్బిట్‌లో భారత్ భవిష్యత్తులో చేపట్టే మానవ సహిత అంతరిక్షయానంపై కీలక ప్రసంగం చేయడానికి ఆహ్వానం అందిందిఫ్రాన్స్ కూడా ఉపయోగకరంగా భావిస్తేభారత ప్రతినిధి బృందంలోని సభ్యులు అంతరిక్షంలో డిజైన్తయారీ సాంకేతికతలుఅంతరిక్షం నుంచి అనుసంధానంఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మించి అంతరిక్ష అన్వేషణ వంటి అదనపు అంశాలపై కూడా ప్రజెంటేషన్లు ఇవ్వగలరని డాక్టర్‌ జితేంద్ర సింగ్ తెలిపారు.

భారత్-ఫ్రాన్స్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసివేగవంతం చేయాలని ఫ్రాన్స్ కోరుకుంటోందని ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్ తెలిపారుసదస్సు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వీడియో సందేశానికి భారత్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో ఆమోదం కోసం ప్రతిపాదించిన ప్రకటనలపై భారత్‌తో నిరంతర సంప్రదింపులను కొనసాగించడాన్ని స్వాగతించారు.

బెంగళూరు స్పేస్ ఎక్స్‌పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యంఇరు దేశాల అంతరిక్ష సంస్థలుపరిశ్రమలుఅభివృద్ధి చెందుతున్న అంతరిక్ష వ్యవస్థల మధ్య పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

2026 సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రొఫెసర్ బాప్టిస్ట్ భారత్‌లో పర్యటించనున్నారుఈ సందర్భంగా బెంగళూరులోని ఇస్రో కేంద్రాలను సందర్శించిడాక్టర్‌ జితేంద్ర సింగ్‌ను కలవాలనే ఆసక్తిని ఆయన వ్యక్తం చేశారుసాధ్యమైన సహకార రంగాలుపారిస్ సదస్సులో ప్రతిపాదించిన అదనపు ప్రజెంటేషన్లపై ఇరు దేశాల బృందాలు సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు.

 

భారత్ఫ్రాన్స్‌లు దాదాపు ఆరు దశాబ్దాలుగా సన్నిహిత అంతరిక్ష భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయిఇస్రోఫ్రాన్స్‌కు చెందిన సీఎన్‌ఈఎస్‌ మధ్య సహకారంలో మేఘా-ట్రాపిక్స్సారళ్‌ వంటి సంయుక్త ఉపగ్రహ యాత్రలు ఉన్నాయి.  భూ పరిశీలనవాతావరణ సంబంధిత అనువర్తనాల రంగాల్లోనూ ఇరు దేశాలు మరింత సహకారాన్ని కొనసాగిస్తున్నాయి.

ఆవిష్కరణలుపరిశోధనమానవ సహిత అంతరిక్షయానంసాంకేతిక అభివృద్ధిప్రైవేటు అంతరిక్ష రంగం భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడం ద్వారా అంతరిక్ష రంగంలో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని మరింతగా బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను ఇరు దేశాలు ప్రకటించడంతో సమావేశం ముగిసింది.

 

 

***


(రిలీజ్ ఐడి: 2306835) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Kannada , Malayalam