రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రాబోయే 10 సంవత్సరాలలో ప్రపంచ భాగస్వామ్యాల కోసం భారతదేశ వ్యూహాత్మక ప్రణాళిక, దార్శనికతను వివరిస్తూ రక్షణ దౌత్య పత్రం ‘రక్ష’ ను ఆవిష్కరించిన రక్షణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 SEP 2026 12:55PM by PIB Hyderabad

‘రక్ష’ పేరుతో రూపొందించిన రక్షణ దౌత్య పత్రాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు. వచ్చే 10 సంవత్సరాల్లో ప్రపంచ రక్షణ భాగస్వామ్యాల కోసం భారతదేశ వ్యూహాత్మక ప్రణాళికను, దార్శనికతను ఈ పత్రంలో వివరించారు. 

ఈ పత్రం భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య విధానంలో మార్పును సూచిస్తూ, జాతీయ భద్రతా లక్ష్యాలను క్రియాశీలక ప్రపంచ సహకారంతో సమన్వయం చేస్తుంది. దీర్ఘకాలిక సుస్థిరత, పరస్పర అభివృద్ధిని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ వ్యూహాత్మక పత్రంలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు:

  • వ్యూహాత్మక భాగస్వామ్యాలు: ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడం.

  • సామర్థ్యం పెంపు: మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం.

  • స్వదేశీ ఎగుమతులు: మేక్-ఇన్-ఇండియా రక్షణ వేదికలను ప్రోత్సహించి, దేశాన్ని విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా మార్చడం. 

  • సముద్ర భద్రత: హిందూ మహాసముద్ర ప్రాంతంలో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్‌గా, తొలి స్పందనదారుగా భారతదేశ పాత్రను బలోపేతం చేయడం.

రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలకమైన మూలస్తంభంగా ఉన్నందున ఈ పత్రం రాబోయే దశాబ్దానికి స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికను అందిస్తుంది. తద్వారా మారుతున్న ప్రపంచ పరిణామాలలో భారత్ శాంతి, స్థిరత్వం, నిబంధనల ఆధారిత వ్యవస్థకు ప్రధాన ఆధారంగా నిలుస్తుందని ఇది హామీ ఇస్తుంది.

ఈ కార్యక్రమంలో ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేథ్, డిఫెన్స్ సెక్రటరీ శ్రీ రాజేష్ కుమార్ సింగ్, కార్యదర్శి (డిఫెన్స్ ప్రొడక్షన్) శ్రీ సంజీవ్ కుమార్, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఈస్ట్) శ్రీ రుద్రేంద్ర టాండన్, వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, వైస్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు సమగ్ర రక్షణ సిబ్బంది విభాగం అధిపతి ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్‌, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2306401) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Tamil , Kannada , Malayalam