యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2024వ సంవత్సరానికి టెన్సింగ్ నార్కే జాతీయ సాహసకృత్య పురస్కారాలు ప్రకటించిన
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ
2025వ సంవత్సర జాతీయ క్రీడా పురస్కారాలతో పాటు ఈ అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 4:23PM by PIB Hyderabad
2024వ సంవత్సరానికి టెన్సింగ్ నార్కే జాతీయ సాహసకృత్య పురస్కారాలను (టీఎన్ఎన్ఏఏ) కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ప్రకటించింది. భూమిపై సాహసకృత్యం, నీటిలో సాహసకృత్యం , గగనతలంలో సాహసకృత్యం, జీవితకాల సాఫల్య పురస్కారం.. ఈ నాలుగు కేటగిరీల్లో అవార్డులను ఇస్తున్నారు.
సాహసకృత్యాల రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలకు ఈ పురస్కారాలు గుర్తింపునిస్తాయి. సవాళ్లు ఎదురైన పరిస్థితులలో సహనశక్తి, రిస్కు తీసుకునేందుకు వెనుకాడకపోవడం, టీం వర్క్ భావన, వేగంగానూ ప్రభావవంతమైన రీతిలోనూ నిర్ణయాన్ని తీసుకోగల చొరవను ప్రోత్సహించడం ఈ అవార్డుల ప్రదానంలో ముఖ్యోద్దేశం. 2024 టీఎన్ఎన్ఏఏ పురస్కార విజేతలుగా ఈ కింద ప్రస్తావించిన వారికి సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది:
2025వ సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలతో పాటు టెన్సింగ్ నార్కే జాతీయ సాహసకృత్య పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేస్తారు. పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఏ తేదీన ఉండేదీ విడిగా ప్రకటించనున్నారు. ప్రతి పురస్కార విజేతకు ఒక ప్రతిమ, ఒక ధ్రువపత్రంతో పాటు రూ.15 లక్షల నగదును అందిస్తారు. జాతీయ ఎంపిక సంఘం సిఫారసుల ఆధారంగా ఎంపికలు పూర్తి చేశారు. జాతీయ ఎంపిక సంఘం నామినేషన్లను నిశితంగా పరిశీలించి జాతీయ గౌరవానికి పురస్కార విజేతల పేర్లను సిఫార్సు చేసింది.
యువతరంలో సాహసకార్యాలు, ఓర్పు, క్రమశిక్షణ, రిస్కు తీసుకోవడానికి వెనుకాడకపోవడం, సహకారపూర్వక టీంవర్కు.. ఈ భావనలను పెంపొందింపచేయడం ఈ పురస్కారాలను ఏర్పాటు చేయడంలోని ముఖ్యోద్దేశం. అంతేకాకుండా సవాళ్లు ఎదురైన పరిస్థితుల్లో వేగంగా, ప్రభావవంతమైన ప్రతిస్పందనను కనబరిచే సామర్థ్యాన్ని ప్రోత్సహించడం కూడా ఈ అవార్డుల ప్రదానంలో మరో ఉద్దేశం. ఈ అవార్డులు దేశం నలుమూలలా సాహసిక కార్యకలాపాల్లో ఎంతో మంది పాలుపంచుకొనేటట్లు స్ఫూర్తిని అందిస్తాయి. ఈ పురస్కారాలు సాహసిక కార్యాలను ప్రోత్సహించడంతో పాటు యువజనుల్లో సాహసం, ధీరత్వం, ప్రావీణ్యాల సంస్కృతిని పెంచి పోషించాలన్న ప్రభుత్వ నిబద్ధతను చాటి చెబుతున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2306010)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10