ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్బెకిస్తాన్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు.. ఒడంబడికలు

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2026 4:48PM by PIB Hyderabad

అవగాహన ఒప్పందాలు… ఒడంబడికలు

వ.సం.

ఒప్పందం

1.

భారత్‌-ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వాల మధ్య 2026-30 మధ్య కాలంలో సాంస్కృతిక ఆదానప్రదాన కార్యక్రమం.

2.

ఉజ్బెకిస్తాన్‌లోని టెర్మెజ్‌లో గల ప్రాచీన బౌద్ధ ప్రదేశాలు ఫయాజ్ తేపా, కరా తేపాల పరిరక్షణ- పునరుద్ధరణ దిశగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఉజ్బెకిస్తాన్ సాంస్కృతిక వారసత్వ సంస్థల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖ

3.

ప్రాచీన పత్రాల భద్రత-నిర్వహణ రంగంలో సహకారంపై భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ‘నేషనల్ ఆర్కైవ్స్’, ఉజ్బెకిస్తాన్ న్యాయ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఉజ్‌ఆర్కైవ్’ల మధ్య అవగాహన ఒప్పందం.

4.

ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల రంగంలో సహకారంపై భారత్‌-ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం.

5.

భూగర్భ శాస్త్ర-ఖనిజ వనరుల రంగాలలో సహకారంపై భారత గనుల మంత్రిత్వశాఖ, ఉజ్బెకిస్తాన్ మైనింగ్ పరిశ్రమ-భూగర్భ శాస్త్ర మంత్రిత్వశాఖల మధ్య అవగాహన ఒప్పందం.

6.

పర్యాటక రంగంలో 2026-28 మధ్య సహకారం కోసం భారత పర్యాటక మంత్రిత్వశాఖ, ఉజ్బెకిస్తాన్ పర్యాటక కమిటీల మధ్య భాగస్వామ్య కార్యక్రమం.

7.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పరిధిలోని ‘సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్’, ఉజ్బెకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అండ్ డిప్లొమసీ’లోగల ‘డిప్లొమాటిక్ అకాడమీ’ మధ్య అవగాహన ఒప్పందం.

8.

ఆర్థిక-ద్రవ్య విధానాలపై చర్చల దిశగా భారత ఆర్థిక మంత్రిత్వశాఖ, ఉజ్బెకిస్తాన్ ఆర్థిక-విత్త మంత్రిత్వశాఖల మధ్య అవగాహన ఒప్పందం.

9.

పర్యావరణ పరిరక్షణ రంగంలో సహకారంపై భారత పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, ఉజ్బెకిస్తాన్ పర్యావరణ-వాతావరణ మార్పుల జాతీయ కమిటీల మధ్య ఒప్పందం.

10.

ఉన్నత విద్య, శాస్త్ర పరిశోధన రంగంలో సహకారంపై భారత ప్రభుత్వం, ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం.

11.

భాగస్వామ్య సంబంధాల దిశగా భారత్‌లోని గుజరాత్ రాష్ట్రం, ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్ ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం.

ఒడంబడికలు :

వ.సం.

ఒప్పందం

1.

భారత్‌-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరణ.

2.

అరల్ సముద్ర ప్రాంతంలో అటవీకరణ కోసం 1 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం

3.

ఉజ్బెకిస్తాన్‌లో హిందీ భాషాభివృద్ధి కోసం లాల్ బహదూర్ శాస్త్రి (100) స్కాలర్‌షిప్‌లు.

4.

తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో ‘ఐసీసీఆర్’ సంస్కృత పీఠం ఏర్పాటు

5.

ఉజ్బెకిస్తాన్‌లో వాణిజ్య చెల్లింపుల దిశగా భారత యూపీఐ అనువర్తనాల వినియోగం సహా ‘జాతీయ క్యూఆర్’- ‘యూజెడ్‌ క్యూఆర్‌’ల స్కానింగ్‌కు వీలు కల్పిస్తూ- ‘ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్’ (ఎన్‌ఐపీఎల్), ఉజ్బెకిస్తాన్‌ ‘నేషనల్ ఇంటర్‌బ్యాంక్ ప్రాసెసింగ్ సెంటర్ జేఎస్‌సీ (ఎన్‌ఐపీసీ)’ల మధ్య వాణిజ్య ఒడంబడిక

 

****


(రిలీజ్ ఐడి: 2304788) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Odia , Tamil , Malayalam