సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చలన చిత్రోత్సవ ఏర్పాట్ల సమీక్ష కోసం కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ అధ్యక్షతన 57వ ఇఫి స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం


యువ, నూతన సినీ రూపకర్తలకు అవకాశాలను కల్పించాలని, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ మురుగన్

భారత, ప్రపంచ సినిమాల ఉత్తమ ప్రదర్శనతో పాటు సృజనాత్మకత మార్పిడిని, అభివృద్ధి చెందుతున్న భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్న ఇఫి

గౌరవ సమాచారప్రసార శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్మురుగన్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో ఆగస్టు 21, 2026న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫిస్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం జరిగిందిచలన చిత్రోత్సవ రాబోయే ఎడిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకుప్రపంచ స్థాయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంగా ఇఫి స్థానాన్ని మరింత బలోపేతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

57వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫినవంబర్ 20 నుంచి 28, 2026 వరకు గోవాలో జరుగుతుంది.

 

 

ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ ఎల్మురుగన్ మాట్లాడుతూ... 57వ ఇఫి వేడుకపై దృక్పథాన్ని వివరించారుయువ విద్యార్థులకునూతన సినీ రూపకర్తలకు భారత చలనచిత్ర పరిశ్రమలో వెలుగులోకి రాని ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలు కల్పించటంపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారుయువ ప్రతిభావంతుల సృజనాత్మకతను ప్రదర్శించేందుకునిపుణులైన సినీ రూపకర్తల నుంచి నేర్చుకునేందుకుప్రపంచ చలనచిత్ర వర్గాలతో అనుసంధానమయ్యేందుకు వేదికగా ఇఫి నిలవాలని తెలిపారుప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ చిత్రాలనుప్రముఖ సృజనాత్మక ప్రతిభను భారత్‌లో ప్రదర్శించటం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉనికిని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

భారతదేశంలో ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించటానికిదేశంలోని సృజనాత్మక పరిశ్రమలను బలోపేతం చేయటానికి శ్రీ అశ్విని వైష్ణవ్ నాయకత్వంలోని మంత్రిత్వ శాఖ నూతన కార్యక్రమాలను చేపడుతోందని డాక్టర్ మురుగన్ స్పష్టం చేశారుఇది ప్రతిభకుఆవిష్కరణలకుప్రపంచ స్థాయి భాగస్వామ్యాలకు అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారుఅంతర్జాతీయ సహకారంవృత్తిపరమైన మార్పిడికి తగిన మార్గాలను బలోపేతం చేస్తూ భారతీయ సినీ వైవిధ్యాన్నిశక్తిని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన ప్రాముఖ్యతను తెలిపారు.

ఇఫి అభివృద్ధిలోదాని నిరంతర విజయంలో గోవా ప్రభుత్వ కీలక పాత్రను గుర్తించిన మంత్రి... గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ మనోహర్ పారికర్ వారసత్వాన్ని స్మరించుకున్నారుఅంతర్జాతీయ చలన చిత్రాలకు గోవాను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మార్చటంలో ఆయన దూరదృష్టి ఎంతగానో దోహదపడిందని కొనియాడారుఇఫిని అత్యుత్తమ ప్రపంచ స్థాయి సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దేందుకు నిరంతరం మద్దతిస్తున్న గోవా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ కృషినీ ఆయన అభినందించారు.

ఈ వేడుక సందర్భంగా సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ... అభివృద్ధి చెందుతున్న భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ప్రచారం కల్పించేందుకుభారతఅంతర్జాతీయ సృజనాత్మక వర్గాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ఇఫిని ప్రధాన వేదికగా వినియోగించుకోవాలన్నారుఈ చిత్రోత్సవానికి హాజరయ్యే సినీ రూపకర్తలుసినీ ప్రియులుప్రతినిధులుఅతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అత్యుత్తమనాణ్యమైన అనుభూతిని అందించాల్సిన ప్రాముఖ్యతను ఆయన తెలియజేశారు.

57వ ఇఫి ఏర్పాట్లుచేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ఎన్‌ఎఫ్‌డీసీ ఎండీ శ్రీ ప్రకాశ్ మగ్దుమ్ ప్రజెంటేషన్ ఇచ్చారుస్టీరింగ్ కమిటీ సిఫార్సులను ఇఫి ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్ స్వాగతించారుమాస్టర్ క్లాసులను బలోపేతం చేయటంయువ సినీ రూపకర్తలకు అవకాశాలు కల్పించటంభారత్విదేశాల నుంచి అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేయటంభారత్ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ రూపకర్తలుసృజనాత్మక ప్రముఖుల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన ప్రాముఖ్యతను ఆయన స్పష్టం చేశారు.

గోవా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి కమిటీకి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఐపీఆర్ కార్యదర్శి వివరించారుఅవసరమైన అన్ని కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు, 57వ ఇఫి ఏర్పాట్లు సజావుగా సాగేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇఫికి విస్తృతమైన అంతర్జాతీయ ప్రచారం కల్పించేందుకుప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసేందుకువివిధ దేశాల నుంచి ప్రముఖ సినీ రూపకర్తలుకళాకారులుసృజనాత్మక నిపుణులను ఆహ్వానించేందుకు స్టీరింగ్ కమిటీ సభ్యులు అత్యంత ప్రాధాన్యతనిచ్చారుఈ చిలన చిత్రోత్సవం కేవలం సినిమా వేడుకగా మాత్రమే కాకుండా సృజనాత్మక మార్పిడికిసహకారానికిఅభివృద్ధి చెందుతున్న సృజనాత్మక భారత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు వేదికగా నిలుస్తుంది.

 

సమాచారప్రసార మంత్రిత్వ శాఖఎన్‌ఎఫ్‌డీసీగోవా ప్రభుత్వంసంబంధిత భాగస్వాములందరి మధ్య పటిష్ఠమైన సమన్వయం ఉండాలని స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసిందిసినిమాసృజనాత్మకతసాంస్కృతిక మార్పిడిప్రపంచ సహకారానికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ వేదిక స్థానాన్ని 57వ ఇఫి సుస్థిరం చేసుకుంటుందని కమిటీ విశ్వాసాన్ని వ్యక్తం చేసిందిభారత సినీ రూపకర్తలుసృజనాత్మక నిపుణులు ప్రపంచంతో అర్థవంతంగా మమేకం అయ్యేందుకు ఇది మరింత మెరుగైన అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తుంది.

ఈ సమావేశంలో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడుఇఫి ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీమేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్గోవా ప్రభుత్వ ఐపీఆర్ కార్యదర్శిప్రముఖ స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీమతి భావనా ఖేర్రామ్ సంపత్అపర్ణా పురోహిత్ప్రేరణ సింగ్నమితసుహాసిని మణిరత్నంఅభిషేక్ జైన్సంతోష్ శివన్గౌరవ్ బెనర్జీఆదిత్య భట్ప్రశాంత్ చోథానిధరం గులాటి పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2302453) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Tamil , Kannada