వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ ఆమోదం పొందిన పరీక్షా కేంద్రాలు (జీఏటీసీ)గా గుర్తింపు పొందడానికి అర్హత కలిగిన సంస్థలకు ప్రోత్సాహం... దరఖాస్తుల దాఖలుకు 2026 ఆగస్టు 31 వరకూ గడువు

ఇప్పటికే గుర్తింపును పొందిన 51 జీఏటీసీలు... సరిచూడటానికి ఉద్దేశించిన పరిధి 23 కేటగిరీలకు విస్తరణ

మరింత పెరిగిన ప్రమాణీకరణ సామర్థ్యం • వేగవంతమైన సేవలు • మెరుగుపడిన వినియోగదారు ప్రయోజనాల పరిరక్షణ

प्रविष्टि तिथि: 20 AUG 2026 12:24PM by PIB Hyderabad

‘2013 లీగల్ మెట్రాలజీ (ప్రభుత్వ ఆమోదాన్ని కలిగి ఉన్న పరీక్షాకేంద్రం) నియమావళి’లో భాగంగా ప్రభుత్వ ఆమోదం పొందిన పరీక్షాకేంద్రాలు (జీఏటీసీస్)గా గుర్తింపును పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా అర్హతలున్న పరిశ్రమలు, ప్రయోగశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలతో పాటు పరీక్షా సదుపాయాలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖకు చెందిన వినియోగదారుల వ్యవహారాల విభాగం సూచించింది.
ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం ఆరంభమైంది. అర్హత కలిగిన సంస్థలను తుది గడువు తేదీ (2026 ఆగస్టు 31)న సాయంత్రం 5 గంటల లోపు వినియోగదారుల వ్యవహారాల విభాగ ఆన్‌లైన్ వెబ్‌సైట్  emaap.gov.in/gatc  ద్వారా దరఖాస్తులను దాఖలు చేయాల్సిందిగా కోరుతున్నారు. దరఖాస్తుల సమర్పణ, రుసుము చెల్లింపు, దరఖాస్తు స్థితిని గమనిస్తుండటం,  దరఖాస్తుదారులతో మాట్లాడడానికి ఈ వెబ్‌సైట్ పూర్తి స్థాయి డిజిటల్ ప్రక్రియను అందిస్తోంది. ప్రక్రియను సరళతరం, పారదర్శకం, వాణిజ్యానుకూలంగా మార్చే ఉద్దేశంతో ఇలా చేశారు.
(జీఏటీసీ ప్రాథమిక ప్రణాళిక (ఫ్రేంవర్క్)కు, పరిధి విస్తరణకు, ప్రమాణీకరణ సేవలకు సంబంధించిన విస్తృత లభ్యత ప్రయోజనాల సమాచారాన్ని వినియోగదారుల వ్యవహారాల విభాగం ఇంతకు ముందు వివరణాత్మకంగా తెలియజేసింది)
The Department has earlier provided detailed information on the GATC framework, its expanded scope and the benefits of wider access to verification services.
విస్తృత భాగస్వామ్యంతో వివరాలను సరిచూసే సామర్థ్య పరిధి పెరగనుంది
వాణిజ్యంలో ఉపయోగించే నిర్దిష్ట తూనికలు, కొలతల ప్రమాణీకరణ, పునఃప్రమాణీకరణ ప్రక్రియల్లో సాంకేతికంగా సమర్థత కలిగిన ప్రయివేటు రంగ సంస్థలు పాలుపంచుకొనేందుకు మార్గాన్ని సుగమం చేసి భారత ప్రమాణీకరణ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను పెంపొందింప చేయాలన్నదే జీఏటీసీ కార్యక్రమ ముఖ్యోద్దేశం.
ఇప్పటి వరకు, 51 జీఏటీసీలకు గుర్తింపును ఇచ్చారు. వినియోగదారుల వ్యవహారాల విభాగం ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌ (వ్యవస్థ)ను మరింత విస్తరించనుంది. దీంతో వాణిజ్య సంస్థలకు వాటి సమీప ప్రాంతాలు మరింత అందుబాటులోకి రాగలవు. ఇది ఫలితాలు రాబట్టడానికి పట్టే కాలాన్ని తగ్గించి, నియమపాలన ప్రక్రియను వేగవంతం చేయనుంది.
ఈ కార్యక్రమం రాష్ట్రాల లీగల్ మెట్రాలజీ విభాగాల ప్రయత్నాలను పూర్తి చేసేదిగా కూడా ఉంటుంది. ప్రమాణీకరణ సేవలకు మరిన్ని ఆమోదిత కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల, రాష్ట్రాల లీగల్ మెట్రాలజీ విభాగాలు మార్కెట్ నిఘా, నియంత్రణ, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంపై ఇప్పటి కన్న ఎక్కువ శ్రద్ధ తీసుకోగలుగుతాయి.
తూనికలు కొలతలకు సంబంధించిన కేటగిరీలు ప్రస్తుతం 23కు చేరాయి
జీఏటీసీ నియమావళిలో ఇటీవల సవరణలు చేసిన తరువాత గుర్తింపు పొందిన జీఏటీసీలు.. ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, రవాణా, రిటైల్, తయారీతో పాటు మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్య రంగాలకు వర్తించే 23 కేటగిరీల్లో తూనికలు, కొలతలను సరిచూడవచ్చు, పునఃప్రమాణీకరణను కూడా చేపట్టవచ్చు.  ఈ కింద ప్రస్తావించినవి ఈ కేటగిరీల పరిధిలోకి  వస్తాయి:


(i) నీళ్ల మీటర్లు
(ii) స్ఫిగ్మోమేనోమీటర్లు
(iii) క్లినికల్ థర్మామీటర్లు
(iv) ఆటోమేటిక్ రైల్ వెయ్‌బ్రిడ్జులు
(v) టేప్ కొలతలు
(vi) మూడో శ్రేణి కచ్చితత్వానికి (150 కేజీల వరకూ)  సంబంధించిన, బరువును తూచే నాన్-ఆటోమేటిక్ యంత్రాలు
(vii) మూడో శ్రేణి కచ్చితత్వానికి సంబంధించిన, బరువును తూచే నాన్-ఆటోమేటిక్ యంత్రాలు
(viii) లోడ్ సెల్స్
(ix) బీమ్ స్కేల్స్
(x) కౌంటర్ మెషిన్లు
(xi) అన్ని కేటగిరీలకు చెందిన తూనికరాళ్లు
(xii) గ్యాస్ మీటర్లు
(xiii) ఇంధన మీటర్లు
(xiv) తేమను కొలిచే యంత్రాలు  
(xv) వాహన వేగాన్ని కొలిచే యంత్రాలు
(xvi) శ్వాస విశ్లేషణ పరికరాలు
(xvii) బహు పార్శ్విక తూనిక ఉపకరణాలు
(xviii) ప్రవాహ మీటర్లు
(xix) పెట్రోల్, డీజిల్ డిస్పెన్సర్లు
(xx) సీఎన్‌జీ డిస్పెన్సర్లు
(xxi) ఎల్‌పీజీ డిస్పెన్సర్లు
(xxii) ఎల్ఎన్‌జీ డిస్పెన్సర్లు
(xxiii) హైడ్రోజన్ డిస్పెన్సర్లు
పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, హైడ్రోజన్ డిస్పెన్సర్లను చేర్చడం జీఏటీసీ ఫ్రేంవర్క్‌లో ఇటీవల చేపట్టిన విస్తరణలో ఓ భాగం. దీనితో  ఇంధన పంపిణీ వ్యవస్థల ప్రమాణీకరణ సామర్థ్యాన్ని బలపరచడంతో పాటు, ఇంధన లావాదేవీల్లో సరైన కొలతలను, పారదర్శకతను ప్రోత్సహించడం సాధ్యపడుతుంది.
పరిశ్రమకు సులభతర మార్గం
జీఏటీసీలను విస్తరించబూనడం వాణిజ్య సౌలభ్యానికి సంబంధించి ఓ ముఖ్య సంస్కరణ. సరిచూడటానికి విభాగానికి సంబంధించిన పరిమిత సదుపాయాలపైనే ఆధారపడటానికి బదులు, విస్తారిత జీఏటీసీ వ్యవస్థ ద్వారా అందే ఆమోదిత సాంకేతిక సదుపాయాలను తయారీదారు సంస్థలు, వ్యాపారులు, వినియోగదారులు గతంలో కన్నా మరింత ఎక్కువ స్థాయిలో పొందొచ్చు.
దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించడానికి, డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులు జరపడానికి, తమ దరఖాస్తులు ఏ స్థితిలో ఉన్నదీ తెలుసుకొనేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు అనేక సార్లు తిరగకుండా డిజిటల్ మాధ్యమ దరఖాస్తు దాఖలు ఏర్పాట్లు దోహదపడతాయి.
జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే నిర్దేశిత పరీక్షా, క్రమాంకన (కాలిబ్రేషన్) పరికరాలు, యోగ్యులైన సాంకేతిక సిబ్బందితో పాటు జీఏటీసీ నియమావళి పరిధిలోకి వచ్చే నిర్దిష్ట మౌలిక సదుపాయాలు కూడా అర్హతలున్న సంస్థల వద్ద ఉండి తీరాలి.
పటిష్ఠమైన లీగల్ మెట్రాలజీ సేవలను దృష్టిలో పెట్టుకొని భాగస్వామ్యాన్ని నెలకొల్పడం
లీగల్ మెట్రాలజీలో భాగస్వామ్య వైఖరికి జీఏటీసీ ఫ్రేంవర్క్ అద్దం పడుతుంది. సాంకేతికంగా సమర్థమైన ప్రయోగశాలలు, పరిశ్రమలు, విద్యా, పరీక్షా సంస్థలను ప్రమాణీకరణ సంబంధిత ఇకోసిస్టమ్‌లో చేర్చి, ప్రభుత్వం లీగల్ మెట్రాలజీ ఫ్రేంవర్క్‌లో భాగంగా నిర్ధారిత నియంత్రణ సంబంధిత పర్యవేక్షణను నిలబెడుతూ విశ్వసనీయ ప్రమాణీకరణ సేవల లభ్యతను పెంపొందింప చేస్తోంది.
ఈ విధానం విస్తృతమైన, మరింత సౌలభ్యవంతమైన, బాధ్యతాయుతమైన ప్రమాణీకరణ వ్యవస్థను రూపొందించడానికి సహాయ పడుతుంది. దీంతో వాణిజ్య సంస్థలతో పాటు వినియోగదారులకూ ప్రయోజనాలు లభిస్తాయి.
శీఘ్రగతిన నియమపాలన, విశ్వసనీయమైన కొలతలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ
నిస్పాక్షిక లావాదేవీలు, వినియోగదారుల్లో విశ్వాసం బలపడాలంటే కచ్చితమైన తూనికలు, కొలతలు ఎంతైనా ముఖ్యం. సరిచూసే, పునఃప్రమాణీకరించే సేవలను మరింత సులభతరంగానూ, కాలబద్ధమైందిగానూ తీర్చిదిద్దడానికి జీఏటీసీల విస్తృత వ్యవస్థ తోడ్పడుతుంది. దీంతో వాణిజ్య లావాదేవీల్లో ఉపయోగించే కొలతలు కచ్చితమైనవిగా, విశ్వసనీయమైనవిగా ఉంటాయి. అంతేకాదు, వాణిజ్య సంస్థలు తమ నియంత్రణ సంబంధిత అవసరాలను నెరవేర్చుకోవడంలోనూ ఈ వ్యవస్థ దోహదం చేస్తుంది.
వ్యాపార నిర్వహణలో సౌలభ్యానికి, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకీ మధ్య ఒక సమతూకాన్ని సాధించడం ఈ సంస్కరణ ముఖ్యోద్దేశం. దీంతో నిజాయతీగా వ్యాపారం చేసుకునే సంస్థలకు నియమ పాలనను సులభతరం కావడంతో పాటు రోజువారి లావాదేవీలలో ఉపయోగించే కొలతల పట్ల విశ్వాసం కూడా బలోపేతం అవుతుంది.
వినియోగదారుల వ్యవహారాల విభాగం తీసుకు వచ్చిన జీఏటీసీ సంస్కరణలు భారతదేశ నాణ్యతా సంబంధిత మౌలిక సదుపాయాల వ్యవస్థను పటిష్ఠపరిచే దిశగా చేపడుతున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఉన్నాయి. అలాగే డిజిటల్ పరిపాలన దిశగా పురోగమించడం, ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతను సాకారం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో ఆమోదించిన కొలతల పద్ధతులతో తులతూగడం కూడా ఈ ప్రయత్నాల్లో భాగాలే.
దరఖాస్తులను 2026 ఆగస్టు 31 వరకూ సమర్పించవచ్చు.

ప్రభుత్వ ఆమోదం పొందిన పరీక్షా కేంద్రాలుగా మారాలనే ఆసక్తితో ఉన్న అర్హత కలిగిన సంస్థలు emaap.gov.in/gatc మాధ్యమం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకోవచ్చు.  
దరఖాస్తుల సమర్పణ కాలం: దరఖాస్తులను 2026 ఆగస్టు 17 మొదలు 2026 ఆగస్టు 31 లోపల సమర్పించాలి.
దరఖాస్తుల దాఖలుకు తుది గడువు, కాలం: 2026 ఆగస్టు 31, సాయత్రం 5 గంటల లోపు.
అర్హతకు సంబంధించిన విస్తృత షరతులు, నిర్దేశిత అవసరాలు, దరఖాస్తు ప్రక్రియ.. వీటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. చివరి తేదీ లోపల దరఖాస్తు చేయాలని అర్హత కలిగిన సంస్థలకు సూచిస్తున్నారు. 51 జీఏటీసీలను ఇప్పటికే గుర్తింపునిచ్చారు. ప్రమాణీకరణ పరిధిని 23 కేటగిరీలకు విస్తరింపచేశారు. సేవల చెంతకు పరిశ్రమ సులభతరంగా చేరుకోగలిగేలా చూడటం, శీఘ్ర నియమపాలన, వాణిజ్య కొలతల కచ్చితత్వం పట్ల వినియోగదారుల్లో గతంతో పోలిస్తే మరింత ఎక్కువ విశ్వాసాన్ని ప్రోది చేయడానికి భారత్ కొలతల ప్రమాణీకరణ వ్యవస్థను వినియోగదారుల వ్యవహారాల విభాగం అంతకంతకూ విస్తరిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2301747) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam