యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ క్రీడా పురస్కారాలు – 2025ను ప్రకటించిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ
प्रविष्टि तिथि:
18 AUG 2026 12:50PM by PIB Hyderabad
జాతీయ క్రీడా పురస్కారాలు–2025ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి, సత్కరించడానికి ప్రతి ఏటా ఈ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ చేసిన ప్రతిపాదన ఆధారంగా వివిధ క్రీడాంశాల్లో దిగువ పేర్కొన్న క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలకు ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది.
ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులకు అర్జున పురస్కారాలు – 2025
గడచిన నాలుగేళ్ల నుంచి క్రీడల్లో ఉత్తమ ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణను చూపిన క్రీడాకారులకు ‘క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున పురస్కారం’ అందజేస్తారు.
క్రీడల్లో అత్యుత్త ప్రదర్శన కనబరిచినవారికి అర్జున పురస్కారాలు (లైఫ్‌టైమ్) – 2025
తమ ఆటతీరుతో క్రీడారంగానికి సేవ చేసి, క్రీడలకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించడానికి ‘అర్జున (జీవన సాఫల్య) పురస్కారం’ ప్రదానం చేస్తారు.
|
S. No.
|
Name of the Sportsperson
|
Discipline
|
|
1.
|
Shri I Arumainayagam
|
Football
|
క్రీడల్లో ఉత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు– 2025
అంతర్జాతీయ పోటీల్లో క్రీడాకారులు రాణించేలా స్థిరమైన, అత్యుత్తమైన, ప్రశంసనీయమైన రీతిలో పనిచేసే కోచ్‌లకు ‘క్రీడల్లో ఉత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య పురస్కారం’ అందజేస్తారు.
సాధారణ విభాగం:
|
S. No.
|
Name of the Coach
|
Discipline
|
|
1.
|
Shri Parveer Singh
|
Athletics
|
|
2.
|
Shri Chhote Lal Yadav
|
Boxing
|
|
3.
|
Ms Neha Nandkumar Chavan
|
Shooting
|
జీవన సాఫల్య విభాగం:
|
S. No.
|
Name of the Coach
|
Discipline
|
|
1.
|
Shri. Dharmendra Singh Yadav
|
Boxing
|
|
2.
|
Shri. Virender Kumar
|
Wrestling
|
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం–2025
క్రీడలను ప్రోత్సహించడంలో, అభివృద్ధి చేయడంలో గణనీయమైన పాత్రను పోషించిన కార్పొరేట్ సంస్థలకు (ప్రభుత్వ/ప్రైవేటు), స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారా’న్ని అందజేస్తారు.
|
S. No.
|
Name of the Entity
|
|
1.
|
Army Paralympic Node, Pune
|
పైన పేర్కొన్న పురస్కారాలు దరఖాస్తులను ఆన్‌లైన్లో ఆహ్వానించారు. ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా క్రీడాకారులు/కోచ్‌లు/సంస్థలకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చారు.
ఈ పురస్కారాల కోసం ఈ ఏడాది భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. వాటిని జస్టిస్ (రిటైర్డ్) మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ పరిశీలించింది. ఈ కమిటీలో ప్రముఖ క్రీడాకారులు, స్పోర్ట్స్ జర్నలిజంలో అనుభవజ్ఞులు, క్రీడా నిర్వాహకులు సభ్యులుగా ఉన్నారు.
***
(रिलीज़ आईडी: 2300855)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam