హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘2026 స్వాతంత్య్ర దినోత్సవం’ సందర్భంగా


పోలీసు, అగ్నిమాపకదళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల సిబ్బందికి

1057 శౌర్య పతకాలు, సేవా పతకాల ప్రదానం

నాడు పోస్టు చేయడమైనది: 14 AUG 2026 8:59AM by PIB Hyderabad

‘2026 స్వాతంత్య్ర దినోత్సవం’ సందర్భంగా శౌర్య పతకాలను, సేవ పతకాలను పోలీసు, అగ్నిమాపకదళం, హోంగార్డ్, పౌర రక్షణ (హెచ్‌జీ అండ్ సీడీ), జైళ్ల సిబ్బంది మొత్తం 1057 మందికి ప్రదానం చేశారు. వివరాలు:

శౌర్య పతకాలు

ప్రాణ రక్షణకూ, ఆస్తి రక్షణకూ పాటు పడినందుకు, నేరాన్ని అడ్డుకున్నందుకు, నేరగాళ్లను పట్టుకున్నందుకు, అలాగే కర్తవ్యం, బాధ్యతల నిర్వహణలో సంబంధిత అధికారి అసాధారణ పనితీరును కనబరిచినందుకు శౌర్య పతకాలు (జీఎమ్) ప్రదానం చేస్తారు.
మొత్తం 301 శౌర్య పతకాలను ప్రదానం చేశారు.  ఈ పతకాలతో 272 మంది పోలీసుల్నీ, అగ్నిమాపకదళంలో పనిచేస్తున్న 29 మందినీ సత్కరించారు.
శౌర్య పతకాలను అందుకున్న వారిలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా, అంటే 197 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 51 మందికి, ఈశాన్య ప్రాంతాలకు చెందిన 12 మందికి, ఇతర ప్రాంతాలకు చెందిన 41 మంది సిబ్బందికి  ఈ పతకాలను అందజేశారు.

సేవా పతకాలు

ప్రావీణ్యంతో కూడిన సేవలను కనబరిచినందుకు రాష్ట్రపతి విశిష్ట సేవ పతకం (పీఎస్ఎమ్)ను అందిస్తారు. విధి నిర్వహణలో ప్రతిభ, కర్తవ్య పాలన పట్ల అంకిత భావాన్ని చాటిన వారిని విశిష్ట సేవా పతకం (ఎమ్ఎస్ఎమ్)తో సత్కరిస్తారు.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను మొత్తం 92 మందికి ఇచ్చారు. 92 పీఎస్ఎమ్‌లలోనూ పోలీస్ సర్వీసు విభాగానికి 83 పతకాలను , అగ్నిమాపక దళం సిబ్బందికి 4 పతకాలను, పౌర రక్షణ, హోం గార్డ్ సర్వీసుకు 3 పతకాలను, జైళ్ల విభాగానికి చెందిన వారికి 2 పతకాలను అందించారు.
మొత్తంమీద 664 విశిష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. వాటిలో పోలీసు సేవ విభాగానికి 606 పతకాలు, అగ్నిమాపక దళం సిబ్బందికి 28, పౌర రక్షణ, హోం గార్డ్ విభాగానికి 18, జైళ్ల సిబ్బందికి 12 పతకాలను అందజేశారు.

 

 సేవల వారీగా అందజేసిన పతకాల వివరాలు 

 

క్రమ సంఖ్య

విషయం

పతక విజేతల సంఖ్య  

అనుబంధ పత్రం

1

శౌర్య పతకం (జీఎమ్)

301

List-I

 

2

విశిష్ట సేవకు ఇచ్చే రాష్ట్రపతి పతకం (పీఎస్ఎమ్)  

92

List-II

3

విశిష్ట సేవకు ఇచ్చే పతకం (ఎమ్ఎస్ఎమ్)  

664

List-III

 

4

రాష్ట్రాల వారీ, దళం వారీ పతక విజేతల జాబితా  

జాబితా ప్రకారం

List -IV

 
 


 ఒకటో జాబితాను చూడడానికి ఇక్కడ Click here to view List-I    
 రెండో జాబితాను చూడడానికి ఇక్కడ Click here to view List-II     
మూడో జాబితాను చూడడానికి ఇక్కడ Click here to view List-III     
నాలుగో జాబితాను చూడడానికి ఇక్కడ Click here to view List-IV
వివరాలను  www.mha.gov.in తో పాటు 

https://awards.gov.in లో కూడా అందుబాటులో ఉంచారు.

 

***


(రిలీజ్ ఐడి: 2299336) సందర్శకుల సూచీ సంఖ్య : : 84