మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ చేనేత దినోత్సవం: చేనేత ఉత్పత్తులను ఆదరించాలని పౌరులకు కేంద్రమంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవీ పిలుపు

प्रविष्टि तिथि: 07 AUG 2026 2:13PM by PIB Hyderabad

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ఆదరించాలనిదేశీయ నేతన్నలుచేతివృత్తి కళాకారులను గౌరవించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి పౌరులను కోరారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఒక సందేశాన్ని పంచుకుంటూ... భారతదేశ చేనేత అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదనిఅది మన సంస్కృతిసంప్రదాయాలకులక్షలాది మంది చేనేత కుటుంబాల జీవనోపాధికి బలమైన పునాది అని కొనియాడారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునకు అందరూ స్పందించాలని కేంద్ర మంత్రి కోరారు. తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని మరింత పెద్ద ప్రజా ఉద్యమంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రత్యేక రోజున మనమంతా ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత) అనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేయాలనిభారతీయ చేనేత వస్తువులను అంగీకరిస్తూ మన కళాకారుల ఆత్మగౌరవాన్నిప్రతిష్టను మరింత పెంచాలని ఆమె పిలుపునిచ్చారు.

 

***


(रिलीज़ आईडी: 2295993) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil