జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆగస్టు 7న 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు.. రాష్ట్రపతి చేతుల మీదుగా 2025 జాతీయ చేనేత అవార్డుల ప్రదానం

భారత చేనేత రంగంలో అత్యుత్తమ ప్రతిభకు సత్కారం.. 22 మందికి సంత్ కబీర్, జాతీయ చేనేత పురస్కారాలు

प्रविष्टि तिथि: 06 AUG 2026 4:42PM by PIB Hyderabad

భారతీయ సంస్కృతికిఆర్థిక వ్యవస్థకు చేనేత కార్మికులు అందిస్తున్న అమూల్యమైన సేవలను గుర్తిస్తూజాతీయ చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆగస్టు 7, 2026న 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనుందిన్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో (ఆర్‌బీసీసీవేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసిద్ధ ‘సంత్ కబీర్ చేనేత అవార్డులు’, ‘జాతీయ చేనేత అవార్డులు-2025’లను అందజేయనున్నారుఈ వేడుకలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పవిత్ర మార్గరీటాకార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావుఅభివృద్ధి కమిషనర్ (చేనేతడాక్టర్ ఎంబీనాపార్లమెంట్ సభ్యులుఉన్నతాధికారులుచేనేత పరిశ్రమ ప్రతినిధులుప్రముఖ నేత కార్మికులుడిజైనర్లుఎగుమతిదారులుచేనేత కళాకారులు అవార్డు గ్రహీతలుఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.

చేనేత రంగంలో విశేష నైపుణ్యంఆవిష్కరణలుడిజైన్ అభివృద్ధిమార్కెటింగ్అంకుర సంస్థలుఉత్పత్తిదారుల సంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ వేడుకలో 22 పురస్కారాలను ప్రధానం చేయనున్నారువీటిలో సంత్ కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత పురస్కారాలు ఉన్నాయి. ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం’ (ఎన్‌హెచ్‌డీపీలోని ‘చేనేత మార్కెటింగ్ సహాయం’ (హెచ్ఎంఏవిభాగం కింద అందించే ఈ అవార్డులు... దేశంలో చేనేత రంగానికి ఇచ్చే అత్యున్నత జాతీయ పురస్కారాలుగా గుర్తింపు పొందాయి.

దేశంలోనే చేనేత నేత కార్మికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే సంత్ కబీర్ చేనేత అవార్డుభారతీయ నేత సంప్రదాయాలను కాపాడుతూప్రచారం చేస్తూజీవితాంతం అంకితభావంతో పనిచేసిన చేతివృత్తి కళాకారులను ఈ అవార్డుతో సత్కరిస్తారుఇక జాతీయ చేనేత అవార్డు ద్వారా సంప్రదాయ నైపుణ్యాలను కాపాడుకుంటూనేఆధునిక పద్ధతులను పుణికిపుచ్చుకుని అద్భుతమైన సృజనాత్మకతనాణ్యతఆవిష్కరణలు చూపిన కళాకారులను గౌరవిస్తారుపూర్తి పారదర్శకతనిష్పాక్షికతతో నిపుణుల కమిటీల ద్వారా బహుళ అంచెల పరిశీలన తర్వాతే విజేతలను ఎంపిక చేస్తారు.

ఈ వేడుకల్లో భాగంగా భారతీయ చేనేత వైవిధ్యాన్నిగొప్ప సంప్రదాయాలను చాటిచెప్పే స్మారక తపాలా బిళ్లలను విడుదల చేయనున్నారుప్రాముఖ్యత కలిగినఎర్త్ రూట్ థ్రెడ్-ఆల్ డైడ్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియాహ్యాండ్లూమ్ అవార్డ్స్ బుక్ 2025 – రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరిస్తారుఈ కార్యక్రమం సందర్భంగా అవార్డు గెలుచుకున్న చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారుసంప్రదాయ కనీ నేతవాల్ హ్యాంగింగ్ నేతల ప్రత్యక్ష ప్రదర్శనలుభారతీయ చేనేత సంప్రదాయాల్లో ఉన్న వైవిధ్యంకళాత్మకతఅత్యుత్తమ హస్తకళా నైపుణ్యాలను సందర్శకులను కనువిందు చేయనున్నాయి.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి వేడుకతో పాటు దేశవ్యాప్తంగా ప్రదర్శనలుడిజైనర్ సమావేశాలుఐఐహెచ్‌టీ సదస్సులుప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దేశంలో పర్యావరణహిత గ్రామీణ ఉపాధికి అత్యంత కీలకమైన వనరుగా చేనేత రంగం కొనసాగుతోందిప్రస్తుతం ఈ రంగం దేశవ్యాప్తంగా 35 లక్షల మందికి పైగా ప్రజల జీవనోపాధికి అండగా నిలుస్తోందిఇందులో మొత్తం కార్మికుల్లో 70 శాతానికి పైగా మహిళలే ఉండటం విశేషంగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన చేయూతనివ్వడమే కాకుండాభారతీయ సంప్రదాయ జౌళి రంగాన్ని పరిరక్షించడంలోపర్యావరణహిత ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించడంలో చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా.. ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారునాటి స్వదేశీ ఉద్యమం భారతీయ స్వదేశీ పరిశ్రమలకుముఖ్యంగా చేనేత రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందికేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించిందిభారతీయ చేనేత కళాకారుల నైపుణ్యంకళాత్మకతఅంకితభావాన్ని కొనియాడటంతో పాటుచేనేత రంగాన్ని పరిరక్షించిప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2295762) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada