హోం మంత్రిత్వ శాఖ
జిల్లా స్థాయి ఫోరెన్సిక్ మొబైల్ వ్యాన్ల వ్యవస్థ
प्रविष्टि तिथि:
05 AUG 2026 3:07PM by PIB Hyderabad
దేశంలో ఫోరెన్సిక్ సామర్థ్యాల ఆధునికీకరణ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలోని అన్ని జిల్లాలకు, రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలకు (ఎఫ్ఎస్ఎల్) మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్లను (ఎంఎఫ్‌వీలు) అందించడానికి రూ. 496.66 కోట్ల మొత్తాన్ని కేటాయించింది.
నేరం జరిగిన స్థలాల్లో శాస్త్రీయంగా తనిఖీలు చేపట్టడానికి ఆధారాల సేకరణకు వీలుగా ఈ వ్యాన్లలో ఆధునిక ఫోరెన్సిక్ పరికరాలను అమర్చారు. ఈ వ్యాన్లలో నేర స్థలాల డాక్యుమెంటేషన్, ఫోటోగ్రఫీ, వీడియోల చిత్రీకరణ, జీవ, సూక్ష్మ సాక్ష్యాల సేకరణ, వేలిముద్రలను గుర్తించడం, సేకరించడం, భౌతిక ఆధారాల ప్రాథమిక విశ్లేషణ, సేకరించిన ఆధారాలు పాడవకుండా సురక్షితంగా భద్రపరచడం, డిజిటల్ డాక్యుమెంటేషన్, ఇతర అత్యవసర ఫోరెన్సిక్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 619 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్లను కేటాయించారు. అయితే ఈ వ్యాన్ల సిబ్బంది నియామకంతో పాటు ఇతర రోజువారీ నిర్వహణ ఖర్చులను సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలే భరించాల్సి ఉంటుంది.
ఈ వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2294839)
आगंतुक पटल : 12