రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ద్విచక్ర వాహన ఆంబులెన్సులు
प्रविष्टि तिथि:
03 AUG 2026 1:19PM by PIB Hyderabad
ద్విచక్ర వాహన అంబులెన్సులకు నియంత్రణపూర్వక ప్రాథమిక ప్రణాళికను రూపొందించడానికి ‘కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989’లో సవరణలను ప్రతిపాదిస్తూ, ఓ ముసాయిదా ప్రకటనను రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ జారీ చేసింది.
గ్రామీణ, మారుమూల, పర్వత ప్రాంతాల్లో త్వరితగతిన అత్యవసర సేవలను అందించడంతో పాటు చికిత్స సంబంధిత సేవలను అందించడంలో ద్విచక్ర వాహన అంబులెన్సులు తోడ్పడతాయి.
కేంద్ర మోటారు వాహనాల నియమావళిలో భాగంగా ప్రస్తుతం ఈ ద్విచక్ర అంబులెన్సులను ఓ ప్రత్యేక తరగతిగా పరిగణించడం లేదు. ఫలితంగా, ఈ కేటగిరీలకు సంబంధించి వీటి తయారీ, నిర్వహణ, క్షతగాత్రుడి తరలింపు వ్యవస్థలు, వాటి ఆమోదం, నమోదు, ఫిట్‌నెస్ వంటి తనిఖీలకు సంబంధించిన జాతీయ ఆవశ్యకతలేవీ లేవు. ప్రతిపాదించిన సవరణలు ఈ లోటును.. ఏఐఎస్-209 (ఒకటో భాగం):2026-ప్రాణ రక్షక ద్విచక్ర అంబులెన్సుల తయారీ, నిర్వహణ ఆవశ్యకతలను ఆమోదించడం ద్వారా తీరుస్తాయి.
• వర్తించే తీరు: 2027 అక్టోబరు 1 న, లేదా ఆ తేదీ తరువాత తయారు చేసిన ఎల్2 కేటగిరీకి చెందిన ద్వి చక్ర వాహన అంబులెన్సులను ఏఐఎస్-209 (ఒకటో భాగం):2026కు అనుగుణంగా ఉండాలని ప్రతిపాదించారు.
• అత్యవసర టాప్ లైట్లు: ద్విచక్ర వాహన అంబులెన్సులకు అమర్చే టాప్ లైట్లు 2027 అక్టోబరు 1 నుంచి ఏఐఎస్-209 (ఒకటో భాగం):2026 కు అనుగుణంగా ఉండాలని ప్రతిపాదించారు.
• నిర్వహణ ప్రాంతం: ఇలాంటి అంబులెన్సులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించిన ప్రాంతాలలో నడపడానికి నమోదు చేసుకోవచ్చు.
• ఫిట్‌నెస్ ఆవశ్యకత: ద్విచక్ర వాహన అంబులెన్సులను రవాణా వాహనాలుగా పరిగణిస్తారు. ఇవి ఫిట్‌నెస్ ఆవశ్యకతలకు లోబడి ఉంటాయి. వీటి ఫిట్‌నెస్ ధ్రువపత్రాలను ప్రతి రెండు సంవత్సరాలకు నవీనీకరించుకోవలసి ఉంటుంది.
• ప్రత్యేక తనిఖీ ఏర్పాట్లు: అంబులెన్సు సహాయక ఉపకరణాలు లేదా రోగి రవాణా యూనిటును భద్రంగా అమర్చడం, టైర్లు, రిమ్ములు, అత్యవసర హెచ్చరిక లైట్లు, పేషెంట్ స్ట్రెచరు, దానికి తాళమేసే ఏర్పాటు, రోగిని సురక్షితం చేసేందుకు ఉద్దేశించిన వ్యవస్థలు, లోడింగు, అన్‌లోడింగు వ్యవస్థలు, అగ్నినిరోధక యంత్రం లభ్యత, చెల్లుబాటు వంటి అంశాలు ఫిట్‌నెస్ తనిఖీ పరిధిలోకి వస్తాయి.
భద్రత, నిర్వహణ నిబంధనలు: ద్విచక్ర వాహన అంబులెన్సును ఎల్2-కేటగిరీ వాహనంగా ఏఐఎస్-209 (ఒకటో భాగం): 2026 నిర్వచిస్తోంది. ఎల్2-కేటగిరీ వాహనంలో.. అంబులెన్సు సహాయక యూనిట్టు గాని, లేదా రోగిని రవాణా చేసేందుకు తగిన వ్యవస్థనుగాని జతచేస్తారు. ఈ ప్రమాణం కీలక నిర్మాణ, విధుల సంబంధిత జాగ్రత్త చర్యలతో కూడి ఉంటుంది. ఈ చర్యలలో.. వాహన స్థిరత్వం, బ్రేకింగ్ సామర్థ్యం, పార్కింగ్ బ్రేకు, గ్రేడింగుకు సంబంధించిన అవసరాలు, వెనుక ఏమి ఉన్నదీ చూపించే ఏర్పాటు, కప్లింగ్ తాలూకు సమగ్రత, అత్యవసర విజిబులిటీ, హెచ్చరిక సాధనాలు, అంబులెన్సు లోపల రోగిని సురక్షితంగా ఉంచి తీసుకువెళ్లడం, పర్యావరణ పరంగా ఎదురయ్యే చిక్కుల నుంచి సంరక్షణకు తోడ్పడే వ్యవస్థలు కలిసి ఉంటాయి.
ద్వి చక్ర వాహన అంబులెన్సుల డిజైను, నిర్వహణలో మరింత భద్రతనీ, బాధ్యతనీ ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ అందిస్తుందని భావిస్తున్నారు. ఇది రాకపోకల పరంగాగాని, లభ్యత పరంగాగానీ సాంప్రదాయిక అంబులెన్సు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చే చోట్ల, సత్వర అత్యవసర ప్రతిస్పందనను అందించడంతో పాటు అత్యవసర చికిత్స సేవలను మెరుగుపరుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2293822)
आगंतुक पटल : 15