గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నైపుణ్యాల నుంచి జాతీయ గౌరవం వరకు: డీడీయూ–జీకేయూకు చెందిన ఆరుగురికి భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం

प्रविष्टि तिथि: 03 AUG 2026 11:32AM by PIB Hyderabad

గ్రామీణ నైపుణ్యాభివృద్ధి తీసుకొస్తున్న పరివర్తనాత్మక ప్రభావాన్ని గుర్తిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ–జీకేవైయువ లబ్ధిదారులు ఆరుగురుకి 2026 ఆగస్టు 15న న్యూఢిల్లీలో జరిగే భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం లభించిందివీరంతా పశ్చిమ బెంగాల్చత్తీస్‌గఢ్మధ్యప్రదేశ్ఒడిశామిజోరాంనాగాలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకలకూరాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ఆతిథ్యమిచ్చే ప్రతిష్ఠాత్మక ‘ఎట్ హోం’ విందుకూ హాజరయ్యేందుకు అధికారిక ఆహ్వాన పత్రాలను... ఎంపికయిన యువ లబ్ధిదారులు ఇండియా పోస్ట్ ద్వారా అందుకున్నారుఇది వ్యక్తిగత విజయాలకు లభించిన గుర్తింపు మాత్రమే కాదుఇది నైపుణ్యాలుస్థిరమైన జీవనోపాధిగౌరవప్రదమైన ఉపాధి ద్వారా డీడీయూ–జీకేవై సాధించిన పరివర్తనకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు కూడా.

image.png

ఎంపికయిన వారు ఎర్రకోటలో జరిగే జాతీయ వేడుకలను వీక్షిస్తారురాష్ట్రపతి భవన్‌లో జరిగే విందుకు హాజరవుతారుఇలాంటి ప్రతిష్ఠాత్మక జాతీయ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం.. గ్రామీణ నైపుణ్య వ్యవస్థకూడీడీయూ–జీకేవై ద్వారా యువ విజేతలుగా నిలిచిన వారికి గర్వకారణంగా నిలుస్తుంది.

image.png

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై–ఎన్ఆర్ఎల్ఎంపరిధిలో ఉపాధి కల్పనతో అనుసంధానమై  ఉన్న కార్యక్రమమే డీడీయూ–జీకేవైపరిశ్రమలకు తగిన నైపుణ్యాలనుదేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లనుసుస్థిరమైనగౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను ఈ కార్యక్రమం గ్రామీణ పేద యువతకు అందిస్తుంది.

image.png

డీడీయూ–జీకేవై ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ యువతకు దీర్ఘకాలిక జీవనోపాధి అవకాశాలు లభించాయిఈ కార్యక్రమం ఆర్థిక సాధికారతనూస్వావలంబననూ సాధించేలా చేసిభారత దేశ వృద్ధి ప్రయాణంలో చురుకైన భాగస్వాములుగా వారిని మార్చింది.

image.png


 

నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని సృష్టించడంలోస్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడంలో ఈ పథకం సాధించిన విజయానికి ఈ ఆరుగురు లబ్ధిదారులకు అందిన ఆహ్వానం జాతీయ గుర్తింపుగా నిలుస్తోందిఉపాధి కల్పనకు మాత్రమే పరిమితం కాకుండా.. నైపుణ్యాభివృద్ధి ద్వారా గ్రామీణ యువతకు గౌరవప్రదమైన కెరీర్లుఆర్థిక స్వాతంత్ర్యంమరింత సురక్షితమైన భవిష్యత్తు లభిస్తుందని ఈ విజయం తెలియజేస్తోంది.

ఎంపికయిన లబ్ధిదారుల పట్టుదలకృషితో పాటు సంబంధిత రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎస్ఆర్ఎల్ఎం)లుప్రాజెక్టు అమలు సంస్థ (పీఐఏ)లుగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన సమష్టి ప్రయత్నాలను ఈ విజయం ప్రతిబింబిస్తుంది.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది గ్రామీణ యువతకు ఈ గౌరవం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందిఅదేవిధంగా నైపుణ్యాలు అవకాశాలను సృష్టిసాయనీసుస్థిర జీవనోపాధి స్వావలంబనను అందిస్తుందనీసాధికారత సాధించిన యువత దేశ వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందనే దార్శనికతను ఈ గౌరవం మరింత బలోపేతం చేస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2293726) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Kannada , Malayalam