ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో ఫోన్ లో మాట్లాడిన బ్రిటన్ ప్రధానమంత్రి
పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ కు అభినందనలు తెలిపిన శ్రీ నరేంద్ర మోదీ
భారత్ - యూకే సంబంధాలను మరింత శిఖరాలకు తీసుకువెళ్లాలని ఇద్దరు నాయకుల నిర్ణయం
प्रविष्टि तिथि:
31 JUL 2026 7:28PM by PIB Hyderabad
బ్రిటన్ నూతన ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడారు.
బ్రిటన్ ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చించారు. భారత్ - యూకే విజన్–2035కు అనుగుణంగా సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, స్వచ్ఛ ఇంధనం, విద్య, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి ప్రాధాన్య రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇద్దరు నాయకులు అంగీకరించారు.
ఇటీవల అమల్లోకి వచ్చిన రెండు దేశాల సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వారా లభించే వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, ఇరు దేశాల ప్రజల ఉమ్మడి శ్రేయస్సు, సంక్షేమాన్ని మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు.
ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనం ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇద్దరు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు.
భవిష్యత్తులో కూడా పరస్పరం నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు.
***
(रिलीज़ आईडी: 2292875)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam