యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం ఆగస్ట్ 2, 2026న నషా ముక్త యువ కార్యక్రమం ప్రారంభం


మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 100 వారాల జన్ భాగీదారీ ఉద్యమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఒకేసారి దాదాపు 10,000 ప్రాంతాల్లో నషా ముక్తి ప్రతిజ్ఞ చేయనున్న కోటి మందికి పైగా యువత

प्रविष्टि तिथि: 29 JUL 2026 2:32PM by PIB Hyderabad

నషా ముక్త్ భారత్వికసిత్ భారత్-2047 స్వప్నాన్ని సాకారం చేయటంలో భాగంగా ఆగస్ట్ 2, 2026న "వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త యువకార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారుజన్ భాగీదారీ స్ఫూర్తితో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించాలని దేశ యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యువత క్రియాశీలక భాగస్వామ్యంతో మై భారత్ ఆధ్వర్యంలో జన ఉద్యమంగా ఈ ప్రచారం ప్రారంభం అవుతుందిఅవగాహన కల్పించటంసామాజిక భాగస్వామ్యంసుస్థిర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం ద్వారా మాదకద్రవ్య రహిత భారత్‌ను నిర్మించాలనే సమష్టి జాతీయ లక్ష్యంతో యువతను ఏకం చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశం.

ప్రధానమంత్రి ప్రసంగం స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సుమారు 10,000 ప్రాంతాల్లో ఒకేసారి ప్రతిజ్ఞను నిర్వహించనున్నారుడ్రగ్స్ రహిత సమాజం కోసం నిబద్ధతను తెలియజేస్తూనషా ముక్త యువ వాలంటీర్లుగా దేశ నిర్మాణానికి తమను అంకితం చేసుకుంటూ... కోటి మందికి పైగా యువత నషా ముక్తి ప్రతిజ్ఞలో పాల్గొంటారు.

ఈ ప్రచారంలో మై భారత్ వాలంటీర్లుమై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్ఎస్వాలంటీర్లుయూత్ క్లబ్బులుపాఠశాలలుకళాశాలలువిశ్వవిద్యాలయాలుప్రభుత్వేతర సంస్థలుపారిశ్రామిక సంఘాలు, 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు పాల్గొంటాయిమాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యువత నేతృత్వంలో జరుగుతున్న అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా ఈ కార్యక్రమం నిలవనుంది.

సాధారణ అవగాహన కార్యక్రమాల మాదిరిగా కాకుండా "వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త యువకార్యక్రమాన్ని 100 వారాల పాటు సాగే ప్రజా భాగస్వామ్య ఉద్యమంగా రూపొందించారుఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకుసామాజిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటానికిదేశ నిర్మాణం దిశగా యువశక్తిని మళ్లించేందుకు రాబోయే 100 వారాల పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా యువత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి సమాజంలో అవగాహన కల్పించటంసానుకూల సామాజిక విలువలను పెంపొందించటం వంటి కార్యకలాపాలను ప్రతీ వారం నిర్వహిస్తారుఇందులో భాగంగా క్రీడా పోటీలువాకథాన్లుధ్యాన సదస్సులుసాంస్కృతిక కార్యక్రమాలుకళాత్మకసృజనాత్మక పోటీలువీధి నాటకాలుఅవగాహనా కార్యక్రమాలుఇతర సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు.

నిరంతర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకువిశేష కృషిని గుర్తించేందుకుఈ ప్రచారంలో అద్భుతమైన సేవలందించే స్వచ్ఛంద కార్యకర్తలుసంస్థలను.. 50, 75, 100 వారాలను పూర్తి చేసుకున్న కీలక సందర్భంగా సత్కరిస్తారుదీని ద్వారా ప్రజా సేవఉమ్మడి బాధ్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తారు.

దేశ ప్రయోజనాల దృష్ట్యా గౌరవ ప్రధానమంత్రి పిలుపుమేరకు ఈ చరిత్రాత్మక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని దేశవ్యాప్తంగా ఉన్న యువతనుసామాజిక సంస్థలను కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ కోరారులక్షలాది మంది యువతవివిధ సంస్థలుసామాజిక సంఘాల సమష్టి కృషితో మాదకద్రవ్యాల వినియోగాన్ని తిరస్కరించేలా వ్యక్తులకు స్ఫూర్తినిస్తూనే.. ఆరోగ్యకరమైనబలమైనమరింత అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి దోహదపడే దేశవ్యాప్త సామాజిక ఉద్యమాన్ని రూపొందించటమే ఈ ప్రచార లక్ష్యం.

మాదకద్రవ్యాలపై పోరాటాన్ని పౌరుల క్రియాశీల భాగస్వామ్యంతో నడిచే ప్రజా ఉద్యమంగా మార్చాలనే ప్రధానమంత్రి దృక్పథాన్నివికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త యువ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. "మాదకద్రవ్య రహిత యువతే వికసిత్ భారత్‌కు అత్యంత బలమైన శక్తిసందేశం ద్వారా జాతీయ సంకల్పాన్ని ప్రతి గ్రామానికిపట్టణానికినగరానికి తీసుకెళ్లటం.. వికసిత్ భారత్-2047 దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయటమే ఈ ప్రచారం ఉద్దేశం.

 

***


(रिलीज़ आईडी: 2291203) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Tamil , Kannada , Malayalam