జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

అస్సాంలో నలుగురు కార్మికుల దుర్మరణంపై మానవ హక్కుల సంఘం నోటీసులు


కాచర్ జిల్లాలో లోహ శుద్ధి కర్మాగారంలో పేలుడు: ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన దుర్ఘటనపై సుమోటోగా స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం

రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను కోరుతూ.. అస్సాం ప్రధాన కార్యదర్శి, కాచర్ ఎస్పీలకు నోటీసు

క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, మృతుల కుటుంబికులు, గాయపడిన కార్మికులకు పరిహారం చెల్లింపు వివరాలను కూడా నివేదికలో చేర్చాలని సూచన

प्रविष्टि तिथि: 29 JUL 2026 11:20AM by PIB Hyderabad

అస్సాంలోని కాచర్ జిల్లాలో ఉన్న ఒక లోహ శుద్ధి కర్మాగారంలో జరిగిన పేలుడులో నలుగురు కార్మికులు మృతిచెందగామరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు 2026 జూలై 26న ప్రచురితమైన మీడియా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిందిపేలుడు అనంతరం.. కరిగిన లోహం కార్మికులపై ఒలికినట్టు మీడియా పేర్కొన్నదికర్మాగారంలో గతంలోనూ ఇలాంటి దుర్ఘటనలు జరిగాయని బాధితుల కుటుంబాలుస్థానికులు ఆరోపించారు.

సంబంధిత మీడియా నివేదికలోని అంశాలు నిజమే అయితే.. అవి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి అత్యంత తీవ్రమైన అంశాలవుతాయని జాతీయ మానవ హక్కుల సంఘం పేర్కొన్నదిఈ విషయంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కోరుతూ.. అస్సాం ప్రధాన కార్యదర్శికీకాచర్ ఎస్పీకీ ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసిందిక్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులతోపాటు మృతుల కుటుంబీకులుగాయపడిన కార్మికులకు పరిహారం చెల్లింపు వివరాలను కూడా ఈ నివేదికలో చేర్చాలని సూచించింది.

2026 జూలై 27న ప్రచురితమైన మీడియా నివేదిక ప్రకారం.. పేలుడు సంభవించిన సమయంలో ఆ కర్మాగారంలో 100 మందికి పైగా కార్మికులు ఉన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2290966) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Manipuri , Tamil