ప్రధాన మంత్రి కార్యాలయం
లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JUL 2026 8:12AM by PIB Hyderabad
లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహోన్నత వ్యక్తిగా లోకమాన్య తిలక్ జాతీయ భావాన్ని మేల్కొలిపారని, ప్రజాసేవకు తమను తాము అంకితం చేసుకొనేలా తరతరాలకు స్ఫూర్తినందించారని ప్రధాని కొనియాడారు.
మన సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, సోదరభావాన్ని పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా అంతే స్ఫూర్తిదాయకమని ప్రధాని అన్నారు. ఆయన రచనలు ప్రజల్లో నూతన విశ్వాసాన్ని, స్వాభిమానాన్ని పెంపొందించాయని శ్రీ మోదీ చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహోన్నత వ్యక్తిగా ఆయన జాతీయ భావాన్ని మేల్కొలిపారు. ప్రజాసేవకు అంకితమయ్యేలా తరతరాలకూ స్ఫూర్తినిచ్చారు. మన సంస్కృతికి ప్రాచుర్యం కల్పించేందుకు, సోదరభావాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు కూడా అంతే స్ఫూర్తిదాయకం. ఆయన రచనలు ప్రజల్లో నూతన విశ్వాసాన్ని నింపాయి. స్వాభిమానాన్ని పెంపొందించాయి.’’
(रिलीज़ आईडी: 2288182)
आगंतुक पटल : 7