ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 JUL 2026 7:11PM by PIB Hyderabad

లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిఒక స్వర్ణ పతకం సహా మొత్తం నాలుగు పతకాలు సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారుభవ్య గున్వాల్సౌమిల్ మైతీనిషిత్ కలనిఅన్మోల్ కుమార్‌లు మాలిక్యులర్ బయాలజీబయోకెమిస్ట్రీసిస్టమాటిక్స్ప్లాంట్ కంప్యూటేషనల్ బయాలజీ వంటి అంశాల్లో అపారమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారువారి విజయం మరెందరో యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్‌లోభారత జట్టులోని నలుగురు సభ్యులూ పతకాలు (ఒక స్వర్ణ పతకం సహాసాధించడం ఎంతో సంతోషకరమైన విషయం.

ఒలింపియాడ్‌లో భవ్య గున్వాల్సౌమిల్ మైతినిషిత్ కలానిఅన్మోల్ కుమార్‌లు సాధించిన విజయం మనందరికీ గర్వకారణంవారు మాలిక్యులర్ బయాలజీబయోకెమిస్ట్రీయానిమల్ ఫిజియాలజీయానిమల్ మార్ఫాలజీసిస్టమాటిక్స్ ప్లాంట్ కంప్యూటేషనల్ బయాలజీ వంటి విషయాల్లో అపారమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు.

ఈ విజయం మరెందరో యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను’’.


(రిలీజ్ ఐడి: 2286427) సందర్శకుల సూచీ సంఖ్య : : 49