ప్రధాన మంత్రి కార్యాలయం
కర్ణాటకలోని కార్వార్‌లో ప్రమాదం... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
09 JUL 2026 2:17PM by PIB Hyderabad
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషాదకర సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’
(रिलीज़ आईडी: 2282816)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam