ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దృఢ సంకల్పం, సకారాత్మక ఆలోచనా విధానాలకు ఉన్న శక్తిని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 JUL 2026 7:39AM by PIB Hyderabad

దృఢ సంకల్పం, నిరంతర కృషి, సకారాత్మక ఆలోచనలే విజయానికి కీలకం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ గుణాలతో దేశ యువతీయువకులు స్ఫూర్తిని పొంది, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా పూర్తి అంకిత భావంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.
‘‘అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఉత్సాహం, దృఢ విశ్వాసం, నిరంతరం ప్రయత్నించడం... ఇవి ప్రగతికి మూలాధారాలని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది. నిరాశకు తల వంచకుండా లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నించే వ్యక్తులే చివరకు విజయాన్ని చేజిక్కించుకుంటారు. ఈ కారణంగా, వ్యక్తులు తిరుగులేని విశ్వాసం, అంకిత భావంతో నిరంతరం పని చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఈ గుణాలే జీవితంలో మనుషులను ప్రగతి, విజయం, శ్రేష్ఠత్వాల వైపు నడిపిస్తాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘దృఢ విశ్వాసం, నిరంతర ప్రయత్నంతో పాటు సకారాత్మక ఆలోచనా విధానం... ఇవి విజయ సాధనకు మూలాధారాలు. మన యువతరం ఈ గుణాలను అలవరుచుకొని పూర్తి అంకిత భావంతో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో నిమగ్నమైంది.
‘‘అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః’’ అని పేర్కొంది.


(రిలీజ్ ఐడి: 2282721) సందర్శకుల సూచీ సంఖ్య : : 41