ఆర్థిక మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియాలో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో, కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును 2026 జూలై 15 వరకు పొడిగించిన ప్రభుత్వం
प्रविष्टि तिथि:
30 JUN 2026 5:20PM by PIB Hyderabad
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, తద్వారా ప్రపంచ సరఫరా వ్యవస్థలో తలెత్తిన అంతరాయాల నేపథ్యంలో.తాత్కాలిక, తక్షణ ఉపశమన చర్యగా, కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం గతంలో 2026 జూన్ 30 వరకు అమలు చేసింది.
ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్‌పీజీ ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరినందున దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ కొరత లేకుండా తగినంత అందుబాటులో ఉంచేలా ఈ సుంకం మినహాయింపును ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో, సంబంధిత రంగాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధారణ మార్పు వచ్చేలా చూడటం కోసం, సదరు మినహాయింపును మరో 15 రోజుల పాటు, అంటే 2026 జూలై 15 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా గతంలో నోటిఫై చేసిన విధంగానే యథాతథంగా కొనసాగుతుంది.
భారత తయారీ రంగానికి మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తన కట్టుబాటును కొనసాగిస్తోంది. గతంలో మాదిరిగానే, ఈ సుంక మినహాయింపు పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్‌లు, మధ్యంతర ఉత్పత్తులపై ఆధారపడిన ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, వస్త్రాలు, ఔషధాలు, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు తదితర తయారీ రంగాలకు విస్తృతంగా ప్రయోజనం చేకూర్చనుంది. అంతేకాకుండా, తుది ఉత్పత్తులను వినియోగించే వినియోగదారులకు కూడా ఈ చర్య ఉపశమనం కలిగించనుంది.
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248110®=3&lang=1
***
(रिलीज़ आईडी: 2279543)
आगंतुक पटल : 8