ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం

प्रविष्टि तिथि: 20 JUN 2026 5:01PM by PIB Hyderabad

గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగవర్నర్ శ్రీ హరిబాబుప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియోశ్రీమతి ప్రవతి పరిదాఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియాశ్రీ కృష్ణ చంద్ర మోహపాత్రపార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీశ్రీ మన్మోహన్ సమాల్శ్రీ బైజయంత్ పాండాఇతర ప్రముఖులుసోదరీసోదరులారా.

ఇటీవల కాలంలో ఒడిశా పండగ సంబరాల్లో మునిగిపోయిందిగత వారమే రాజా పండగను ఉత్సాహంగా జరుపుకున్నారుమహాప్రభు జగన్నాథుని రథయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయిమయూర్‌భంజ్‌లోని బరిపడ రథయాత్రపై ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.

వీటన్నింటి మధ్య ప్రజాస్వామ్యఅభివృద్ధి పండగ కూడా జరుగుతోందిఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందిఈ సందర్భంగా మిమ్మల్ని కలిసే అవకాశం రావటంమయూర్‌భంజ్‌ని సందర్శించే భాగ్యం కలగటంపెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి రావటంతో ఈ సందర్భం నాకు మరింత ప్రత్యేకంగా మారింది.

మీ అభిమానమే నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడికి తీసుకువస్తోందిమీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలుడబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఒడిశా అభివృద్ధి ప్రయాణం పట్ల ప్రజలకు శుభాకాంక్షలుఅభినందనలు తెలియజేస్తున్నా.

ఈ సందర్భంగా పండిట్ రఘునాథ్ ముర్ముడాక్టర్ దమయంతి బెస్రాశ్రీ చరణ్ హెంబ్రం వంటి ప్రముఖ వ్యక్తులకు నివాళులర్పిస్తున్నాసంతాలీ భాష కోసం ఓల్ చికి లిపిని రఘునాథ్ ముర్ము సృష్టించారుమన ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోనూ అందుబాటులోకి తెచ్చిందిఒడిశా ముద్దుబిడ్డలను పద్మ అవార్డులతో గౌరవించాంఈ మహానుభావుల కలలన్నింటినీ సాకారం చేసేందుకు గత రెండేళ్లుగా ఒడిశా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది.

మిత్రులారా,

మరో కారణం వల్ల కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదిమయూర్‌భంజ్‌ నేలపై పెరిగిన ఒడిశా ముద్దుబిడ్డగౌరవ రాష్ట్రపతి ఇవాళ మనతో ఉన్నారుఆమె పుట్టినరోజు కూడా ఇవాళే.

గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాఆయురారోగ్యాలతో ఆమె దీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తున్నానునా ప్రార్థనలను ఆ జగన్నాథ స్వామికి భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాఒడిశా పుత్రిక దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టిదిశానిర్దేశం చేయటం మనందరికీ గర్వకారణం.

రాష్ట్రపతి వ్యక్తిత్వంఉదారమైనదయాగుణం గల స్వభావం.. దేశానికిసమాజానికి సేవ చేయటంలో ఆమెకున్న అంచంచలమైన నిబద్ధత కేవలం మయూర్‌భంజ్‌ కు గుర్తింపునే కాకఒడిశా ఖ్యాతిని పెంచాయిఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

ఈ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నపుడు కేవలం ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించిన కారణాలు మాత్రమే ఉన్నాయిఈ పర్యటన కోసం చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయికానీ కుదరలేదుజూన్ 21న కోల్‌కతాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఖరారైనప్పుడుఅదే రోజున బెంగాల్ దినోత్సవం కావడంతో.. ఉదయం మయూర్‌భంజ్‌ని సందర్శించిసాయంత్రానికి కోల్‌కతా కార్యక్రమానికి హాజరుకావచ్చని నేను భావించానుఅలా జూన్ 20వ తేదీ ఖరారైంది.

కానీ కొన్ని విషయాలు దైవానుగ్రహంతో జరుగుతాయికాకతాళీయమే అయినాఈ రోజు మరో గొప్ప విషయం కూడా ఉందిఇవాళ గౌరవ రాష్ట్రపతి పుట్టినరోజు కూడా కావడం విశేషంఈ శుభ సందర్భంగా ఆమె స్వగ్రామాన్ని సందర్శించిస్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపే గొప్ప అవకాశం నాకు లభించింది.

మిత్రులారా,

నేడు రాష్ట్రపతితో కలిసి పహాడ్‌పూర్‌ను సందర్శించానుఈ ప్రాంతంలోని పిల్లల కోసం ఆమె నిర్మించిన పాఠశాలను చూశానుఅక్కడున్న పిల్లలతో కొన్ని మరపురాని క్షణాలను గడిపే అవకాశం నాకు లభించింది.

ఆ పిల్లల ముఖాల్లోని వెలుగునురాష్ట్రపతి పంచే ఆప్యాయతనుఅనురాగాన్ని నేను గమనించానుఅక్కడున్న పిల్లల్లో ఏ ఒక్కరూ రాష్ట్రపతి వచ్చినట్లుగా భావించటం లేదు.. తమ తల్లే వారి వద్దకు వచ్చినట్లు భావిస్తున్నారు.

నిజంగా ఆ పిల్లలు ఎంతో అదృష్టవంతులుఈ ప్రాంతంలోని పేదవెనకబడినగిరిజన పిల్లలు.. దేశం కోసం ఏదైనా గొప్పగా చేయాలనే స్ఫూర్తినివిశ్వాసాన్ని పొందుతున్నారు.

ఇలాంటి గొప్ప అనుభవాలను పొందే అవకాశం కల్పించిన రాష్ట్రపతికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాఈ రోజును నేను మర్చిపోలేనుఎందుకంటేఇవాళ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.

మిత్రులారా,

ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాపహాడ్‌పూర్ గ్రామాన్ని సోలార్ గ్రామంగాసూర్య గ్రామంగా అభివృద్ధి చేయనున్నారు.

ప్రతి ఇల్లూ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందిఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందినట్లుగాపహాడ్‌పూర్ సూర్య గ్రామంగా గుర్తింపు పొందుతుందని గర్వంగా చెప్పుకోవచ్చుఈ దిశగా పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడటమే నా ప్రయత్నంఈ గ్రామం సోలార్ విలేజ్‌గా గుర్తింపు పొందుతుందిఈ కార్యక్రమం ద్వారా పహాడ్‌పూర్ ప్రజలకు ఉచిత సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందిఉత్పత్తి అయిన అదనపు విద్యుత్ ఆదాయాన్ని పెంచుతుంది.

మిత్రులారా,

ఒడిశాలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ రెండేళ్ల పాలన చరిత్రాత్మకమైనదిముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ నాయకత్వంలో నేడు ఒడిశా అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోందిఇక్కడ పేదల సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పులొస్తున్నాయిపెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒడిశా.. పెట్టుబడులనుపరిశ్రమలను ఆకర్షించే సామర్థ్యాన్ని నిరూపించుకుంటోందికొత్త ఉపాధి అవకాశాల కల్పనకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మిత్రులారా,

తూర్పు భారత అభివృద్ధి ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుందనేది కేంద్ర ప్రభుత్వ దార్శనికతఅందుకే మేం పూర్వోదయ విధానంపై పని చేస్తున్నాంకాంగ్రెస్ హయాంలో వెనుకబాటుతనానికి చిహ్నంగా మారిన తూర్పు భారతంప్రస్తుతం ప్రగతికి ముఖద్వారంగా మారుతోందిఒడిశా రాష్ట్రమే ఈ మార్పుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

మిత్రులారా,

ఒడిశాకు సముద్ర తీరంఖనిజ సంపదబలమైన వ్యవసాయ రంగంఅన్నింటికీ మించి ప్రతిభ గల యువత ఉన్నారుఈ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు మనం కలిసికట్టుగా పని చేస్తున్నాందీనివల్ల ఒడిశా రైల్వే మౌలిక సదుపాయాల్లో రికార్డు స్థాయి పెట్టుబడులు వస్తున్నాయికొత్త రహదారులుఆర్థిక కారిడార్ల నిర్మాణంఓడరేవుల విస్తరణ జరుగుతోందిఇంధనంసెమీకండక్టర్లుగ్రీన్ ఎనర్జీ ఆధునిక పరిశ్రమల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి.

ఒడిశా అభివృద్ధికి సంబంధించి ఇవాళ ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయిమరికొన్నింటికి శంకుస్థాపనలు జరిగాయిఈ ప్రాజెక్టులు సుమారు రూ.47,000 కోట్ల వ్యయంతో కూడినవివిద్యుత్రోడ్లురైల్వేలుఆరోగ్యంవిద్యా రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు మీ అందరికీ ఎంతో మేలు చేస్తాయిఈ ప్రాజెక్టుల సందర్భంగా ఒడిశా ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

మా ప్రభుత్వం ఒడిశా వనరులను అవకాశాలుగా మారుస్తోందిభారీ పెట్టుబడులను ఆకర్షించేందుకునూతన పరిశ్రమల స్థాపనకు ఉత్కర్ష్ ఒడిశా వంటి ప్రచార కార్యక్రమాలను చేపడుతోందిఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే దాదాపు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందాయిరూ.3.5 లక్షల కోట్లకు పైగా విలువైన పలు మెగా ప్రాజెక్టుల పనులు కూడా కొనసాగుతున్నాయి.

పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒడిశా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాంవిద్యుత్ రంగంలో రూ. 6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయిసమృద్ధ షహరా యోజన ద్వారా పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతోందిరాబోయే ఏళ్లలో ఈ ప్రయత్నాల ఫలితాలను చూస్తాం.

మిత్రులారా,

డబుల్-ఇంజిన్ ప్రభుత్వ ప్రధాన లక్షణం.. నేరుగా ప్రజలకు ప్రయోజనాలను అందించటంసామాన్య పౌరులు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయటమే మా ప్రయత్నంఈ ప్రయత్నాల ఫలితంగానే నేడు యువతమహిళలురైతులుసామాన్య పౌరుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయిరైతులకు క్వింటాలు వరి కొనుగోలుకు రూ. 3,100 అందించాలని నిర్ణయం తీసుకున్నాంసుభద్ర యోజన ద్వారా కోటి మందికి పైగా తల్లులకూఆడపడుచులకు ఆర్థిక సహాయం అందింది.

ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా ఒడిశాలోని కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు మార్గం సుగమమైందిగిరిజన విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేయకుండా ఉండేందుకు మాధో సింగ్ హాత్ ఖర్చా యోజనను ప్రారంభించాం.

మహాప్రభు శ్రీ జగన్నాథుని భక్తుల భావాలను గౌరవిస్తూభక్తుల కోసం శ్రీమందిరంలోని నాలుగు ద్వారాలను తెరిచారుడబుల్ ఇంజిన్ ప్రభుత్వ బలంతో ఇప్పుడు అన్ని రంగాల్లోనూఅన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతోంది.

మిత్రులారా,

ఇటీవల ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక పరిశుభ్రత ప్రచారం గురించి నాకు తెలిసిందిఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమమైన "స్వచ్ఛత సే స్వాగత్సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారటాన్ని గమనించానుఒడిశా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాఈ ప్రశంసనీయమైన ప్రయత్నానికిగానూ అక్కడి ప్రజలకుప్రభుత్వానికిముఖ్యమంత్రికి అభినందనలను తెలియజేస్తున్నా.

మిత్రులారా,

పరిశుభ్రత మన జీవనశైలిలో భాగం కావాలిఇది రోజువారీ అలవాటుగా మారాలిఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

నా జీవితంలో కీలకమైన సమయంలో గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవకుడిగా పనిచేస్తూ గడిపానుఅలాంటి ప్రాంతాల్లో గౌరవ రాష్ట్రపతి స్వయంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఎన్నో ఏళ్లు గడిపారుగిరిజన ప్రాంతాలకు ప్రాథమిక వసతులు అంత సులభంగా చేరలేదనే విషయం మా ఇద్దరికీ తెలుసుఅందువల్ల మన ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిందిఅటువంటి ప్రాంతాలను నిత్యావసర వసతులతో అనుసంధానించేందుకు ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌ను మేం ప్రారంభించాంఈ కార్యక్రమం ద్వారా అక్కడ నివసించే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా ఆరోగ్యంవిద్యరహదారులుగృహ నిర్మాణానికి సంబంధించిన విభాగాలు సమగ్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.

గౌరవ రాష్ట్రపతితో నిర్వహించిన చర్చలువారి మార్గదర్శకత్వ ఫలితమే పీఎం జన్మన్ అభియాన్గిరిజన సమాజంలోనే అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారుఇప్పుడు ప్రభుత్వ సేవలు గిరిజన వర్గాల వద్దకునేరుగా వారి గ్రామాలకుఇంటివద్దకే వెళ్తున్నాయి.

మిత్రులారా,

గిరిజన సమాజ అభ్యున్నతి కోసం గిరిజన యువతకు విద్యాఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాంపిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలను కల్పించేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 500 ఏకలవ్య మోడల్ పాఠశాలలను ప్రారంభించాంసుమారు 750 ఏకలవ్య పాఠశాలలకు అనుమతులు వచ్చాయిప్రీ-మెట్రిక్పోస్టు-మెట్రిక్ స్థాయిల్లో 1.5 కోట్లకు పైగా గిరిజన విద్యార్థులకు వందల కోట్ల రూపాయల విలువైన ఉపకార వేతనాలను అందించాంమయూర్‌భంజ్‌లో మరో నవోదయ విద్యాలయ స్థాపనకు ఆమోదం లభించిందని వెల్లడించేందుకు ఎంతో సంతోషిస్తున్నా.

మిత్రులారా,

దూరప్రాంతాల్లో నివాసాల వల్ల గిరిజన సమాజాలు ఆరోగ్య సంబంధిత సవాళ్లను ఎదుర్కొన్నాయిసికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులు వీరికి పెద్ద సవాలుగా మారాయిఈ వ్యాధులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారాన్ని మేం ప్రారంభించాంనాలుగు కోట్లకు పైగా ఆరోగ్య కార్డులను పంపిణీ చేశాంఉచిత చికిత్స కోసం కోట్ల మంది గిరిజన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను అందించాం.

జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోందిఈ ప్రయత్నాల ఫలితాలను ఇవాళ మనం చూస్తున్నాం.

దశాబ్దాలుగా ఉన్న ఇబ్బందుల నుంచి గిరిజన సమాజం బయటపడుతోందిఅభివృద్ధిలో ప్రధాన భాగం అవుతోంది.

మిత్రులారా,

రాబోయే ఏళ్లలో మన ముందు రెండు కీలక లక్ష్యాలున్నాయి. 2036 నాటికి ఒడిశా రాష్ట్రంగా ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతాయి. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయిఒడిశాదేశం.. రెండింటి మార్గంగమ్యం ఒకటేఒడిశా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతేభారత్ కూడా బలంగా మారుతుందిఒడిశా సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉందిఅందరం కలిసి ఒడిశాను అభివృద్ధి పథంలో ఉన్నత స్థాయికి చేర్చాలి.

మిత్రులారా,

రేపు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాంజ్ఞానభూమియోగభూమి అయిన ఒడిశా సాంస్కృతిక జీవన విధానంలో యోగా ఎప్పటి నుంచో భాగంగా ఉందిదేశవ్యాప్తంగాప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఈ ఒడిశా గడ్డ నుంచి పిలుపునిస్తున్నానేటి ఈ కార్యక్రమంఅభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాముఖ్యంగా గౌరవ రాష్ట్రపతి పని చేసినసేవలందించిన ప్రాంతానికి ఆమెతో కలిసి వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మరోసారి ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

జై జగన్నాథ్!

జై జగన్నాథ్!

జై జగన్నాథ్!

గమనికప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదంవాస్తవానికి ఆయన హిందీలో ప్రసంగించారు.

 

***


(रिलीज़ आईडी: 2276894) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam