ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ వేడుకలను


పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న రెడ్ రోడ్ నుంచి ప్రారంభించిన ప్రధాని

యోగా అందరినీ అనుసంధానిస్తుంది... ఐకమత్యంగా ఉంచుతుంది: పీఎం

జీవన విధానంగా యోగా మారినప్పుడు అది మానవాళి ఐక్యతకు పునాది అవుతుంది: పీఎం

శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు, ఉత్సాహంగా ఉండేందుకు యోగా సహకరిస్తుంది: పీఎం

జీవన సమతౌల్య కళను యోగా నేర్పిస్తుంది: పీఎం

మానసిక ఆరోగ్యం నుంచి శారీరక ఆరోగ్య సాధనకు మార్గాన్ని అందించే యోగా: పీఎం

प्रविष्टि तिथि: 21 JUN 2026 9:28AM by PIB Hyderabad

ఈ రోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద జాతీయ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారువేలాది యోగా సాధకులతో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్‌లో శ్రీ మోదీ పాల్గొన్నారుఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారుఏడాదిలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21 అని శ్రీ మోదీ తెలిపారుఅలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే అతిపెద్ద సామూహిక వేడుకల్లో ఈ రోజు ఒకటని వివరించారు.

కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారుప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యోగా చేస్తున్న దృశ్యాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ‘‘హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకుబెంగాల్ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ ప్రాంతంలోని సౌరాష్ట్ర వరకు.. యోగా స్ఫూర్తితో దేశమంతటా నూతన శక్తి ఆవిష్కృతమవుతోందిఆరోగ్యంసామరస్యం పట్ల ఉన్న ఉమ్మడి నిబద్ధతతో దేశంప్రపంచం ఒకదానితో ఒకటి ముడిపడినట్లుగా కనిపిస్తోందియోగాకున్న ఐక్యతా శక్తిని ఇది ప్రతిబింబిస్తోంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.

‘‘స్వచ్ఛత సే స్వాగత్’’ కార్యక్రమం ద్వారా కోల్‌కతా ప్రజలు చేపట్టిన ప్రయత్నాలను ప్రధానమంత్రి అభినందించారుపరిశుభ్రతను కాపాడటంలో అక్కడి పౌరులు ప్రదర్శించిన అంకితభావంశ్రమించే తత్వంసామాజిక స్పృహ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిని అందిస్తున్నాయని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌కు ఉన్న విశిష్ట ఆధ్యాత్మికసాంస్కృతిక వారసత్వం కారణంగా ఇక్కడ నిర్వహిస్తున్న యోగా దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుందని శ్రీ మోదీ చెప్పారుభగవాన్ రామకృష్ణ పరమహంస జీవించినఆధ్యాత్మిక బోధన చేసిన పవిత్ర భూమి బెంగాల్ అని ఆయన గుర్తు చేసుకున్నారుఇక్కడి నుంచే స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్నియోగా సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశారనీ చెప్పారుయోగ తత్వశాస్త్రంసాధనలో పురోగతికి మహర్షి అరబిందోలాహిరీ మహాశయ ఇక్కడి నుంచే విశేష కృషి చేశారని తెలిపారుగురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ బోధనలను ప్రస్తావిస్తూ... చుట్టూ ఉన్న ప్రపంచంతో ఏర్పడే అర్థవంతమైన అనుబంధాలతోనే నిజమైన మానవ గుర్తింపు రూపుదిద్దుకుంటుందనీఈ సూత్రమే యోగాలో ముఖ్యమైన అంశమనీ ప్రధానమంత్రి అన్నారుసమస్త జీవనమే యోగా అన్న మహర్షి అరవిందుల నమ్మకాన్ని కూడా ఆయన ఉటంకించారువ్యక్తి జీవితంలో యోగా భాగమైనప్పుడుఅది మానవ ఐక్యతా పునాదిని బలోపేతం చేస్తుందని తెలియజేశారు. ‘‘యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదుదీనిని నిర్దుష్ట వయసుల వారికే పరిమితం చేయలేంఇది మానవ జీవితంలోని ప్రతి దశనూ సుసంపన్నం చేసే చైతన్యానికీప్రాణశక్తికీమానసిక ప్రకాశానికీ మూలాధారంఅని శ్రీ మోదీ స్పష్టం చేశారుఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తమైన ‘‘ఆరోగ్యవంతమైన ఆయుష్షు కోసం యోగా’’ గురించి ఆయన వివరించారువయసు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగాచురుగ్గాఉత్సాహంగా ఉండే ఓ మంచి మార్గాన్ని యోగా అందిస్తుందని ఆయన చెప్పారు.

ఆరోగ్యకరమైన ఆయుర్దాయం అంటే వయసు పైబడుతున్నప్పటికీ మనిషిలో ఉన్న సామర్థ్యాలు తగ్గకుండా చూసుకోవడమేనని ప్రధానమంత్రి తెలియజెప్పారుజీవితమంతా నిరంతర వృద్ధినీస్వీయ మెరుగుదలనూ కొనసాగించేలా యోగా ప్రోత్సహిస్తుందనీ ఆయన తెలియజేశారుఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పటికంటే.. నలభై ఏళ్ల వయసులో మరింత దృఢంగాముప్పై ఏళ్ల వయసులో ఉన్నదాని కంటే యాభై ఏళ్ల వయసులో మరింత ఉత్సాహంగాయాభై ఏళ్ల వయసులో ఉన్నదానికంటే డెబ్బై ఏళ్ల వయసులో జీవనశైలి వ్యాధులను తట్టుకొనేలా మరింత దృఢంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన సూచించారుశారీరక దారుఢ్యాన్ని పెంపొందించడానికీశక్తి స్థాయులను కొనసాగించడానికీఒత్తిడినీ తగ్గించడానికీమానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికీ యోగా సాయపడుతుందని ప్రధాని వివరించారుఅదే సమయంలో జీవనశైలి రుగ్మతలను నివారించడంలో కూడా సహకరిస్తుందనీ తెలియజేశారు. ‘‘క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా తమ శరీరాన్నీమెదడునీ నిత్యం అధ్యయనం చేసే వారిగా వ్యక్తులు మారుతారుస్వీయ అవగాహనే.. స్వీయ నిర్వహణకూఆరోగ్యకరమైన జీవితానికీ మార్గాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు’’ అని శ్రీమోదీ పేర్కొన్నారు.

‘‘ఆరోగ్యవంతమైన ఆయుష్షు కోసం యోగా’’ అనే ఇతివృత్తం అన్ని వయసుల వారికీ వర్తిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారుఇది ఆరోగ్యంశ్రేయస్సువ్యక్తిగత ఎదుగుదల దిశగా సాగే ప్రయాణంలో జీవితకాలం పాటు మన వెంట ఉండే స్నేహితునిగా యోగాను మారుస్తుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా భగవద్గీత బోధనల గురించి శ్రీ మోదీ వివరించారు. ‘‘సమతుల ఆహారపు అలవాట్లూసమతౌల్యమైన వినోదమూసమతూకంగా ఉండే పనులూసమతుల్యత ఉన్న నిద్ర-మెలకువ.. దుఃఖాల నుంచి విముక్తి పొందే మార్గంగా యోగాను మారుస్తాయి’’ అని చెప్పారుఈ సమభావమే యోగాకు అత్యంత ముఖ్యమైన పునాది అనీపరిపూర్ణమైన జీవితానికి కూడా అవసరమైనదనీ ప్రధాని అభిప్రాయపడ్డారుసమతౌల్యంగా ఎలా జీవించాలో యోగా నేర్పిస్తుందన్నారుమానవులు చేయాల్సిన వాటినీచేయకూడని వాటినీ తెలియజేస్తూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవడానికి యోగా తోడ్పడుతుందని వివరించారు.

శారీరక వ్యాయామంగా మాత్రమే పరిమితం కాకుండా మానసిక ఆరోగ్యం నుంచి శారీరక ఆరోగ్యం దిశగా నడిచే మార్గాన్ని యోగా అందిస్తుందన్నారు. ‘‘యుక్తచేష్టస్య కర్మసు’’ అనే గీతా వాక్యాన్ని ఉటంకిస్తూ... ఏది సరైనదోఏది కాదో గుర్తించే విచక్షణను పెంపొందించుకోవడానికి యోగా సహాయపడుతుందని తెలిపారు. "ఇలాంటి అవగాహన మానసిక ప్రశాంతతకు మూలాధారంగా మారుతుందిఅలాగే ప్రపంచ సామరస్యానికి మార్గాలను సుగమం చేస్తుందివ్యక్తిగత జీవనశైలి సాధనగా మాత్రమే పరిమితం కాకుండా..  ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి అవసరమైనదిగా యోగా మారింది’’ అని శ్రీ మోదీ అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏటా కోట్లాది ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని శ్రీ మోదీ అన్నారుఅలాగేయోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవడానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించే అవకాశాన్ని కూడా ఈ రోజు అందిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారుకేవలం ఒక రోజుకో లేదా ఒక కార్యక్రమానికో యోగాను పరిమితం చేయకుండా.. తమ జీవితంలోతమ కుటుంబంలోభవిష్యత్తు తరాల జీవితాల్లో యోగాను శాశ్వత భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

‘‘యోగా 365’’ కార్యక్రమంలో సాధించిన పురోగతిని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ‘‘దీనిలో భాగంగా నిర్వహించిన 100 రోజుల ఆన్‌లైన్ యోగా కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించింది. 130 దేశాల నుంచి మూడు మిలియన్లకు పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఇది ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆమోదాన్నీప్రజాదరణనూ ప్రతిబింబిస్తోందిఅని శ్రీ మోదీ తెలియజేశారు.

మరింత బలమైనసుసంపన్నమైనఆత్మవిశ్వాసం నిండిన దేశానికి ఆరోగ్యకరమైన సమాజమే పునాది వేస్తుందని శ్రీ మోదీ అన్నారుఅందరి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ... ‘‘సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః’’ (అందరూ ఆనందంగా ఉండాలిఅందరూ ఆరోగ్యంగా ఉండాలిప్రార్థనా వాక్యాన్ని ఉటంకిస్తూ.. ప్రసంగాన్ని ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2276422) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam