MIFF banner

ఎంఐఎఫ్‌ఎఫ్‌-2026లో ‘భారతి ఔర్ బిబో’ ప్రపంచ తొలి ప్రదర్శన: భారత మహిళా దిగ్గజాలకు యానిమేటెడ్ నివాళి

స్నేహా రవిశంకర్ దర్శకత్వంలోఎన్ఎఫ్‌డీసీపప్పెటికా మీడియా సంయుక్తంగా నిర్మించిన హిందీ యానిమేషన్ సిరీస్ భారతి ఔర్ బిబో’ ప్రపంచ తొలి ప్రదర్శనకు 19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేదికగా మారిందిఈ సిరీస్‌ను పరిచయం చేసిన దర్శకురాలు రవిశంకర్.. దీనిని ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించారుఈ ప్రాజెక్టులో ఎన్‌ఎఫ్‌డీసీ సహకారాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారుభారతీయ మహిళలకు నివాళిగావారి కథలకు ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నవి ఉన్నట్లుగా ప్రదర్శిస్తున్నామనే ప్రకటనతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది.

 

చిన్నారి భారతిఆమె మాంత్రిక సహచరి బిబో ద్వారా ఈ సిరీస్ కథనం సాగుతుందిఆమె పేరు భారత్ స్త్రీ రూపాన్ని సూచిస్తుందిమహిళలు వారి రోజువారీ జీవితంలో డ్రైవర్లుసంరక్షకులుకథక్ నృత్యకారులురైతులుజిమ్నాస్టులుకళాకారులుగా పోషిస్తున్న పాత్రలను కీర్తించే ఒక బృందగానంతో ప్రతి ఎపిసోడ్ ప్రారంభమవుతుందిఆ బృందగానంలో ‘‘నారీ మే దేవీ మేముఝ్ సే హై సబ్‌కుచ్ముఝ్ మే హై సబ్‌కుచ్’’ అనే పల్లవి వినిపిస్తుందిగొప్ప మహిళలంటే ఇలాగే ఉంటారనే ఒక మూస ధోరణిని ఈ వైవిధ్యమైన ప్రదర్శన తోసిపుచ్చుతుంది.

 

భారత్‌కు చెందిన నలుగురు నిజ జీవిత మహిళా దిగ్గజాల జీవితాలను వివరిస్తుందిఇందులో అహల్యాబాయి హోల్కర్’ ఎపిసోడ్ ఇండోర్ రాజ కుటుంబం నుంచి మరాఠా రాణిగా ఆమె ఎదిగిన తీరునుఆమె పరిపాలనా చాతుర్యాన్నిదౌత్యనీతిని వర్ణిస్తుందిఆమెకు బలమైన నాయకత్వ పాఠాలు నేర్పిన ఆమె అత్తగారి పాత్ర ద్వారా మహిళలు పోషకులుగా ఎలా ఉంటారనే విషయాన్ని కూడా ఇందులో అద్భుతంగా ప్రతిబింబించారు.

 

గోండ్వానా రాణి పరిపాలనఅక్బర్ నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యాన్ని ఆమె ఎదిరించిన తీరును రాణి దుర్గావతి ఎపిసోడ్ కళ్లకు కడుతుంది‘‘ఆమె కేవలం ఒక మహిళ మాత్రమే’’ అని అక్బర్ సైన్యం ఆమెను తక్కువ అంచనా వేస్తుందికానీ తన అచంచలమైన సంకల్పంతో తన శక్తిని వారు గుర్తించేలా ఆమె చేస్తుందిశత్రువులకు లొంగిపోవడం కంటే మరణమే మేలని ఆమె ఎంచుకోవడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుందిజబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం ద్వారా ఆమె వారసత్వాన్ని నేటికీ గౌరవిస్తున్నారుసాధారణంగా మహిళల సున్నితత్వానికి ప్రతీకగా భావించే గులాబీ రంగును యానిమేటర్ ఇందులో భిన్నంగా చూపించారుఆ రంగును ధైర్యసాహసాలతో కూడిన సైన్యంగా మలిచారు.

 

ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించిన కోల్‌కతా సామాజిక సంస్కర్త ప్రయాణాన్ని రాణి రాష్మణి ఎపిసోడ్ చూపుతుందిఆమె ప్రజా సంక్షేమ మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాకుండాఈశ్వర చంద్ర విద్యాసాగర్‌తో కలిసి బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టంతో సహా పలు సంస్కరణల కోసం పనిచేశారుదక్షినేశ్వర్ ఆలయాన్ని ఒక మహిళ నిర్మించినందున అక్కడ పూజలు చేయడానికి పూజారులు నిరాకరిస్తారుదీంతో మతపరమైన పితృస్వామ్య వ్యవస్థను కూడా ఈ ఎపిసోడ్ ప్రశ్నిస్తుంది.

 

రాజ వంశాల కథలకు కాస్త భిన్నంగా సాలుమరద తిమ్మక్క ఎపిసోడ్ సాగుతుందిప్రాథమిక విద్యకు నోచుకోక చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న కర్ణాటకకు చెందిన  పర్యావరణవేత్త కథ ఇదిఆమె వందలాది చెట్లను నాటివాటిని తన సొంత పిల్లల్లా ఎలా పెంచి పోషించారో ఇందులో చూపించారుఆ సేవలకుగానూ ఆమెకు పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది. 

 

ఈ సిరీస్‌లోని అన్ని ఎపిసోడ్లలోనూ వైధవ్యంవివాహ వ్యవస్థమహిళలు మౌనంగా భరించిన భావోద్వేగపూరితమైన కష్టాలను చాలా వాస్తవికంగా ఆవిష్కరించారుకథాకథనంలో పూర్తిగా మాతృస్వామ్య విధానానికి పరిమితం కాకుండాస్త్రీవాద దృక్పథంతో లింగ సమానత్వాన్ని అత్యంత సున్నితంగా చూపించడం ఇందులో విశేషం. 

 

ఈ ధారావాహిక వినోదంతో కూడిన విద్య విధానంలో ఉండటం వల్ల యువతకుపిల్లలకు చరిత్ర సులభంగా అర్థం కావడంతో పాటు ఆసక్తికరంగా ఉంటుందిభారత్‌కు చెందిన ఇలాంటి గొప్ప మహిళల వీరగాథలు మరుగున పడిపోయే ప్రమాదం ఉన్న ప్రస్తుత తరుణంలో పిల్లలు వారి గురించి తెలుసుకోవడానికివారి సేవలకు విలువనిచ్చిఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి భారతి ఔర్ బిబో సిరీస్ ఒక అద్భుతమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2276406   |   Visitor Counter: 7