ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర పర్భణీలో ఘోర ప్రమాదం.. గోడ కూలి ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం

నాడు పోస్టు చేయడమైనది: 20 JUN 2026 6:53PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

‘‘మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలడం వల్ల ప్రాణనష్టం సంభవించడం తీవ్ర విచారకరం. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

***


(రిలీజ్ ఐడి: 2275794) సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam