హోం మంత్రిత్వ శాఖ
భారత్‌లోని అమెరికా రాయబారి శ్రీ సెర్గియో గోర్‌తో కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా సమావేశం
భారత్-అమెరికాల మధ్య.. ప్రధానంగా ఉగ్రవాద నిర్మూలన-మాదకద్రవ్య నిరోధం సహా వివిధ రంగాల్లో భద్రత సహకారం విస్తృతిపై సమగ్ర చర్చ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ భాగస్వామ్యం మరింత పటిష్టంపై నిబద్ధతతో ఉన్నాం: భారత్
प्रविष्टि तिथि:
18 JUN 2026 3:15PM by PIB Hyderabad
కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా నేడు భారత్‌లోని అమెరికా రాయబారి శ్రీ సెర్గియో గోర్‌తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“న్యూఢిల్లీలో ఈ రోజు భారత్‌లోని అమెరికా రాయబారి శ్రీ సెర్గియో గోర్‌తో సమావేశమయ్యాను. భద్రత రంగంలో... ప్రత్యేకించి ఉగ్రవాద నిర్మూలన, మాదకద్రవ్యాల నిరోధంపై రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా మేం సమగ్రంగా చర్చించాం” అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అలాగే,
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడమే కాకుండా ఈ ద్వైపాక్షిక సంబంధాల ద్వారా రెండు ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని భారత్ దృఢ నిశ్చయంతో ఉంది” అని ఆయన ప్రకటించారు.
***
(रिलीज़ आईडी: 2274762)
आगंतुक पटल : 8