హోం మంత్రిత్వ శాఖ
అభివృద్ధి, వారసత్వాల సంగమం... మోదీ ప్రభుత్వ హయాంలో 12 ఏళ్లు స్వర్ణయుగం: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రపంచస్థాయి రవాణా, మౌలిక సదుపాయాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలతో గత పన్నెండేళ్లలో విశేష పురోగతి సాధించిన భారత్
అభివృద్ధి, వారసత్వం సమన్వితాలని నిరూపించిన ప్రధాని మోదీ
प्रविष्टि तिथि:
18 JUN 2026 12:13PM by PIB Hyderabad
గత 12 ఏళ్లలో అభివృద్ధినీ, సాంస్కృతిక వారసత్వాన్నీ రెండింటినీ ప్రోత్సహించడంలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: ‘‘అభివృద్ధి, వారసత్వాల సంగమంగా నిలిచిన మోదీ ప్రభుత్వ హయాంలోని 12 ఏళ్లు నిజంగా స్వర్ణయుగం. ఈ పన్నెండేళ్లలో ఒకవైపు శ్రీ రామ మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాల్ లోక్ నిర్మాణాలను చేపట్టగా... మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అన్న భండార్ వంటి పథకాలు, అలాగే ప్రపంచ స్థాయి అనుసంధానం, మౌలిక సదుపాయాలు, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధి ప్రస్థానానికి మునుపెన్నడూ లేనంతగా ఊపునిచ్చాయి.
కోటి పురావస్తు రికార్డులను డిజిటలీకరించడం, 668 పురాతన కళాఖండాలను తిరిగి తీసుకురావడం, 11 గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంలను నెలకొల్పడం, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదాను కల్పించడం ద్వారా.. అభివృద్ధి, వారసత్వం సమన్వితమైనవని ప్రధానమంత్రి శ్రీ మోదీ నిరూపించారు.”
***
(रिलीज़ आईडी: 2274759)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam