ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో “సురక్షితమైన కృత్రిమ మేధ
సత్వర అమలు” అన్న అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
18 JUN 2026 5:01AM by PIB Hyderabad
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో “కృత్రిమ మేధను సురక్షితంగా, వేగంగా, సమర్థంగా అమలు చేయడం” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
మావన నాగరితక దిశను పునర్నిర్వచించగల సామర్థ్యం ఉన్న పరివర్తనాత్మక శక్తి కృత్రిమ మేధ అని ప్రధానమంత్రి అన్నారు. అయితే, అది ప్రజలకు సాధికారత కల్పించేలా కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఈ విస్తృతమైన ఆలోచనతో.. ఈమధ్యే ఏఐ ఇంపాక్ట్ సదస్సును భారత్ నిర్వహించిందని వివరించారు. ఏఐ కోసం భారత్ అనుసరిస్తున్న మానవ కేంద్రక లేదా మానవ్ దార్శనికత గురించి తెలియజేశారు. సమ్మిళిత్వం, భద్రత, ప్రజాక్షేమం అనే సూత్రాలపై ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆధారపడి ఉండాలన్నారు.
సైబర్ స్పేస్‌ను ప్రపంచ మానవాళికి ప్రయోజనం చేకూర్చేదిగానే భారత్ పరిగణిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. కీలకమైన సమాచార మౌలిక వసతులను భద్రపరిచే, సైబర్ ముప్పును ఎదుర్కోవడంలో సాయపడే ఏఐ నమూనాలు ప్రజాస్వామ్య దేశాలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ఏఐ అభివృద్ధిలో భద్రతనూ, వేగాన్నీ, సామర్థ్యాన్నీ కలిపి అందించే సమగ్ర విధానానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఆయన నాలుగు సూచనలిచ్చారు. అవి- రూపకల్పన స్థాయిలోనే ఏఐ వ్యవస్థలు సురక్షితంగా ఉండాలి. ఉమ్మడి ప్రమాణాలు, ప్రయోగ విధానాలు, ఉమ్మడి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏఐ అమలు ఉండాలి. డీప్‌ఫేక్‌లు, అసత్య సమాచారం, సైబర్ నేరాలను నియంత్రించడంలో సమర్థవంతమైన ప్రపంచ సహకారం ఉండాలి. సమ్మిళిత ప్రపంచాన్ని సాధించేలా గ్లోబల్ సౌత్ దేశాలకు సైతం ఏఐ ప్రయోజనాలు చేరాలి.
మానవ సామర్థ్యాన్ని పెంపొందించేదిగా, మానవ ఎంపికకు సాధికారత కల్పించేదిగా, మానవ గౌరవాన్ని పరిరక్షించేదిగా ఏఐ ఉండాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ లక్ష్యాలను ప్రోత్సహించడానికి భాగస్వాములతో కలసి భారత్ పనిచేస్తుందని తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
***
(रिलीज़ आईडी: 2274516)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam