ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన కింద దాదాపు


రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను జూన్ 19న పంపిణీ చేయనున్న ప్రధాని

మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారికి రూ. 15,000 వరకు ప్రోత్సాహకం

నిరంతర ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం లక్ష్యంగా.. ప్రతి అదనపు ఉద్యోగికీ నెలకు రూ. 3,000 వరకు యాజమాన్యాలకు ప్రోత్సాహకం

ఉద్యోగ కల్పనకు సదుపాయాలు, ఉపాధిని వ్యవస్థాగతం చేయడం, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడం లక్ష్యంగా పీఎం-వీబీఆర్‌వై

ఈ ప్రోత్సాహకాల ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 లక్షల మంది లబ్ధిదారులకు

प्रविष्टि तिथि: 17 JUN 2026 3:14PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2026 జూన్ 19న సాయంత్రం గంటలకు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో.. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వైకింద దాదాపు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు.

ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడంఉపాధి వ్యవస్థీకరణను ప్రోత్సహించడంఉపాధిని పెంపొందించడంఅన్ని రంగాల్లో సామాజిక భద్రతా పరిధిని విస్తరించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక ‘పీఎం-వీబీఆర్‌వై’ అమలులో.. ఈ ప్రోత్సాహకాల పంపిణీ కీలకమైన ఘట్టంగా నిలవనుందిఇప్పటికే దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనలో ఈ పథకం దోహదపడింది.

వ్యవస్థాగత ఆర్థిక వ్యవస్థలో యాజమాన్యాలూకార్మికులూ ఇద్దరూ భాగస్వాములయ్యేలా పీఎం-వీబీఆర్‌వై పథకాన్ని రూపొందించారుమొదటిసారి ఉద్యోగంలో చేరేవారు ఈ పథకం కింద రూ. 15,000 వరకు ప్రోత్సాహకాన్ని పొందేందుకు అర్హులుఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తున్న వేళ.. వారికిది కీలకమైన చేయూతనిస్తుందిఅదనంగా ఉపాధిని కల్పించే యజమాన్యాలు కూడా ప్రోత్సాహకాన్ని పొందేందుకు అర్హత సాధిస్తాయిఒక్కో అదనపు ఉద్యోగికి నెలకు రూ. 3,000 వరకు యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయిదీంతో నిరంతర ఉపాధి కల్పనకు ప్రోత్సాహం లభిస్తుందిఆర్థికవృద్ధిని వేగవంతం చేయడంలో తయారీ రంగానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యా.. ఈ రంగంలోని యాజమాన్యాలు నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకాలను పొందుతాయివేరే రంగాల్లోని యాజమాన్యాలు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలను పొందవచ్చు.

ఉపాధి ప్రాతిపదికన వృద్ధిని పెంపొందించేందుకు అనుకూలమైన వ్యవస్థను పెంపొందించడంలోనూయువతకు అత్యుత్తమవ్యవస్థీకృతమైన ఉపాధి అవకాశాలుగా దేశ ఆర్థిక పురోగతిని మలచడంలోనూ ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం ప్రతిబింబిస్తుంది.

ప్రధానమంత్రి-వికసిత భారత్ రోజ్‌గార్ యోజన 2025 ఆగస్టు 1న అమల్లోకి వచ్చిందిమొత్తం రూ. 99,446 కోట్ల వ్యయంతో.. రెండేళ్ల కాలంలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యంవీరిలో దాదాపు 1.92 కోట్ల లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించేవారై ఉంటారని అంచనాఉద్యోగులకూయాజమాన్యాలకూ చేయూతనివ్వడం ద్వారా.. వ్యవస్థాగత ఉపాధిని విస్తరించడంసామాజిక భద్రతా పరిధిని బలోపేతం చేయడంవికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పథకం విప్లవాత్మక పాత్ర పోషిస్తోంది.  

 

***


(रिलीज़ आईडी: 2274085) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam