ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో "నూతన భాగస్వామ్యాల ఏర్పాటు
అంతర్జాతీయ ఐక్యతను పునర్నిర్మించటం" అంశంపై ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
16 JUN 2026 10:07PM by PIB Hyderabad
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సులో "నూతన భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ ఐక్యతను పునర్నిర్మించటం" అంశంపై ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ఇంధనం, ఆహారం, ఆరోగ్యం, సైబర్, ఆర్థిక భద్రత వంటివి ఒకదానితో మరొకటి ముడిపడున్న అనుసంధాన ప్రపంచంలో మానవాళి పురోగతి, సంక్షేమానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించుకోవటం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో స్వార్థ ప్రయోజనాల కోసం... వాణిజ్యం, సాంకేతికత దుర్వినియోగం అవుతున్నాయని, ఇది అంతర్జాతీయ వేదికపై విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. కోవిడ్ మహమ్మారి నేర్పిన పాఠాలను ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో విశ్వాసం, పారదర్శకతను పెంపొందించటంపై దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ సహకారం పట్ల భారత్ విధానాన్ని వెల్లడిస్తూ.. "మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత" సూత్రాన్ని భారత్ ఎల్లప్పుడూ అనుసరిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి, గ్లోబల్ బయో-ఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్ లేదా ఏక్ పెడ్ మా కే నామ్ (మాతృమూర్తి కోసం మొక్క) వంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టటంలో ఈ ఆలోచన ప్రధానంగా కొనసాగుతుందని చెప్పారు. శ్రీలంకలో తుఫాను, ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం, మొజాంబిక్‌లో వరదలు, జమైకాలో హరికేన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సంభవించినప్పుడు భారత్ మొదటగా స్పందించేందుకు ఈ సమ్మిళిత విధానమే కారణమని తెలియజేశారు.
భారత సమ్మిళిత, సుస్థిర వృద్ధిని ప్రస్తావిస్తూ.. "సర్వ జన హితాయ, సర్వ జన సుఖాయ" (అందరి సంక్షేమం, సంతోషం) అనే మంత్రం ద్వారా ఆర్థిక సమ్మిళిత, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారిత ప్రజా సాధికారత, మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని పెంపొందించటంలో ప్రశంసనీయ ఫలితాలు వచ్చినట్లు వివరించారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాలు దాత-గ్రహీత పరిధిని దాటి.. ఐక్యత, సమాన యాజమాన్యం దిశగా సాగాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవటమే దేశాల మధ్య ఐక్యత నిర్మాణానికి అతిపెద్ద అడ్డంకి అని, దీన్ని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాల్సిన అవసరముందని తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు చర్చలు, దౌత్యానికి తొలి ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2273887)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam